సూపర్ స్టార్ రజనీ కాంత్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రజనీ కాంత్ ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరో గా నటించి తమిళ సినిమా ఇండస్ట్రీ లో ఇప్పటికి కూడా స్టార్ హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్నాడు. రజినీ కాంత్ కేవలం తమిళ సినిమా ఇండస్ట్రీ లో మాత్రమే కాకుండా తాను నటించిన మూవీ ల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానుల మనసు దోచుకున్నాడు. ఇది ఇలా ఉంటే కొన్ని సంవత్సరాల క్రితం సూపర్ స్టార్ రజనీ కాంత్ "బాబా" అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. సురేష్ కృష్ణ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ మూవీ లో మనిషా కొయిరాలా హీరోయిన్ గా నటించగా ఏ ఆర్ రెహమాన్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ విడుదలకు ముందు ఈ మూవీ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కాకపోతే ఈ మూవీ ప్రేక్షకులు ఆశించిన మేరా విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోలేదు. 

మూవీ తెలుగు లో కూడా భారీ అంచనాల నడుమ విడుదల అయింది. ఈ మూవీ తెలుగు ప్రేక్షకులను కూడా భారీ ఎత్తున థియేటర్ లలో అలరించ లేక పోయింది. కాకపోతే ఈ సినిమా ఆ తర్వాత మాత్రం ప్రేక్షకుల నుండి మంచి ఆదరణను తేల్చుకుంది. ఇది ఇలా ఉంటే బాబా మూవీ ని మళ్లీ రి రిలీజ్ చేయబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఈ మూవీ రీ రిలీజ్ యుఎస్ఎ హక్కులను సరిగమ సినిమా సంస్థ దక్కించుకుంది. అలాగే ఈ సంస్థ ఈ సినిమాను యూఎస్ఏ లో 50 పైగా లొకేషన్ లలో డిసెంబర్ 11 వ తేదీన విడుదల చేయనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: