తెలుగు యంగ్  అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ ప్రస్తుతం హిట్ 2 విజయాన్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు.ఇందులో ఆయన కూల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించి మరోసారి తన స్టైల్ లో చాలా బాగా మెప్పించారు.డైరెక్టర్ శైలేష్ కొలను ఈ సినిమాకి రచన, దర్శకత్వం వహించారు. ఈయన డైరెక్షన్‌లో ఇంతకు ముందు రూపొంది ఘన విజయాన్ని సాధించిన 'హిట్ ది ఫస్ట్ కేస్' చిత్రానికి ఇది ఫ్రాంచైజీగా వచ్చింది. అడివి శేష్ ఇందులో కె.డి అనే పాత్రలో నటించగా ఇక ఆయనకు జోడీగా ఆర్య అనే పాత్రలో మీనాక్షి చౌదరి నటించింది. ఈ డిసెంబర్ 2 వ తేదీన వరల్డ్ వైడ్ భారీ రేంజ్‌లో విడుదలై సూపర్ హిట్ అందుకుంది ఈ సినిమా. టాలీవుడ్  స్టార్  హీరో న్యాచురల్ స్టార్ నాని హిట్ యూనివర్స్‏ను నిర్మించగా.. త్వరలోనే హిట్ 3 సినిమా కూడా రాబోతుందంటూ హింట్ ఇచ్చేశారు. ఇక మూడో భాగంలో నాని హీరోగా కనిపించనున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్‏గా తెరకెక్కిన హిట్ 2 సినిమాకు ప్రేక్షకుల నుంచి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ క్రమంలోనే హీరో అడివి శేష్ నెటిజన్లతో ట్విట్టర్ చాట్ చేయడం జరిగింది.


అందులో ఫాలోవర్ల్స్ అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు.ఆ క్రమంలో సూపర్ స్టార్ మహేష్ అభిమాని హిట్ వర్స్ లో మహేష్ అన్నని హీరోగా పెట్టండి. సినిమా ఖచ్చితంగా మరోస్థాయికి వెళ్తుంది.. ఆయనతో మీరొక థ్రిల్లింగ్ స్టోరీ చేస్తే మాకు చూడాలని ఉందని అన్నాడు.అందుకు అడివి శేష్.. ఇది ఆయనకు సూట్ అవుతుందో లేదో కొంచెం ఆలోచించాలి. అయితే ఈరోజు ఉదయం ఆయన నాకు ఫోన్ చేసి నాతో చాలా సేపు మాట్లాడారు. నా విషయంలో చాలా గర్వంగా ఉన్నానని చెప్పారు.ఇక ఆ క్షణం నాకు కన్నీళ్లు వచ్చేశాయి. ఒక తమ్ముడిగా ఆయనకి ఎప్పటికీ తోడుగా ఉంటానని ఆయనకు మాటిచ్చాను. ఇంకా అలాగే ఆయనకు హిట్ 2 సినిమా చూపించాలని చాలా ఆశగా ఎదురుచూస్తున్నాను అంటూ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: