తమిళ సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న అజిత్ ప్రస్తుతం తూనీవు అనే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. మంజూ వారియర్మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటిస్తూ ఉండగా , బోనీ కపూర్మూవీ ని భారీ బడ్జెట్ తో నిర్మించాడు. హెచ్ వినోద్ ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం పొంగల్ కానుకగా విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ నుండి మొదటి సాంగ్ ను డిసెంబర్ 9 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ తాజాగా అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని పోస్టర్ లను విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది.  

ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని జనవరి 11 వ తేదీన విడుదల చేయడానికి మూవీ యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దర్శకుడు హెచ్ వినోద్ చెప్పిన కథ మొత్తం వినకుండానే కేవలం తునివు మూవీ లోని ఒక్క సన్నివేశం వినే ఈ మూవీ ని అజిత్ ఓకే చేశాడట. కాకపోతే చివరకు వినోద్ చెప్పిన ఆ సీన్ ను మూవీ లో నుంచి తీసేసారట అని ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ పై తమిళ సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు మామూలు రేంజ్ లో అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: