ఫిదాతో అందర్నీ ఫిదా చేసిన టాలీవుడ్ అమ్మడు సాయి పల్లవి ఇటీవలికాలంలో సినిమాలకు దూరంగానే ఉంది. విరాటపర్వం తరు వాత సినిమాలకు వీడ్కోలు పలికిందనే వార్తలు ఆమె అభిమానుల్ని నిరాశకు గురి చేసింది.ఇప్పుడు మరో అప్‌డేట్ అదే అభిమానులకు సంతోషం కలగజేస్తోంది.

జార్జియాలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన సాయి పల్లవి..ఫిదా సినిమా తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అద్భుతమైన అభినయం, అందం అన్నింటికీ మించి సూపర్బ్ డ్యాన్స్ ఆమె ప్రత్యేకత. విరాటపర్వం సినిమా తరువాత ఆమె సినిమాలకు బైబై చెప్పింద నే వార్తలొచ్చాయి. తిరిగి డాక్టర్ వృత్తిని కొనసాగించనుందనే వార్తలు ప్రచారమయ్యాయి. ఇది విని ఆమె అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇక సినిమాలు మానేసిందనే ప్రచారం జరిగింది. ఈ క్రమం లో సాయి పల్లవికి సంబం ధించిన మరో న్యూస్ అప్‌డేట్ ఆ అభిమానులకు ఆనందాన్నిస్తోంది.

సాయి పల్లవి తిరిగి సినిమాల్లో వస్తోందనేది ఆ వార్త. అది కూడా భారీ బాలీవుడ్ సినిమా ఆఫర్ వచ్చింద ని సమాచారం. బాలీ వుడ్ నిర్మాత రణబీర్ కపూర్ తెర కెక్కిస్తున్న రామాయణం సినిమా లో రణబీర్ కపూర్ రాముడి పాత్ర పోషిస్తుండగా..సీత పాత్రకు సాయి పల్లవి ఎంపి కైందని తెలుస్తోంది. ఇక రావణుడి పాత్ర లో హృతిక్ రోషన్ కన్పించ నున్నాడు. కొన్ని వందల కోట్ల బడ్జెట్ ‌తో తెరకె క్కుతున్న సినిమా లో సాయి పల్లవికి అవకాశం దక్కింద నే వార్త ఇప్పుడు హల్‌ చల్ చేస్తోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువ డాల్సి ఉంది. కాగా ఇదే రామాయణ ఇతివృత్తం పై ప్రభాస్ రాముడి పాత్ర లో తెర కెక్కుతున్న ఆదిపురుష్ సినిమా లో సీత పాత్రను కృతి సనన్ పోషిస్తోంది. ఈ రెండు సినిమా ల్లో సీత పాత్రకు ఎవరు న్యాయం చేస్తా రో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: