టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న డైరెక్టర్ లలో ఒకరు అయినటు వంటి పూరి జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . పూరి జగన్నాథ్ ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లకు దర్శకత్వం వహించి దేశ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని సంపాదించు కున్నాడు . ఇది ఇలా ఉంటే తాజాగా పూరి జగన్నాథ్ టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ తో బాక్సింగ్ నేపథ్యం లో లైగర్ అనే భారీ బడ్జెట్ తో ఒక పాన్ ఇండియా మూవీ ని నిర్మించిన విషయం మన అందరికీ తెలిసిందే . భారీ అంచనాల నడుమ విడుదల అయిన లైగర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయం అందుకుంది . ఇలా లైగర్ మూవీ తో బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని ఎదుర్కొన్న పూరి జగన్నాథ్ ప్రస్తుతం తన తదుపరి మూవీ లపై ఫుల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది .

అందులో భాగంగా పూరి జగన్నాథ్ తదుపరి మూవీ ని బాలీవుడ్ స్టార్ హీరో తో చేయబోతున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది . అసలు విషయం లోకి వెళితే ... బాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరో లలో ఒకరిగా కొనసాగుతున్న బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో పూరి జగన్నాథ్ తన తదుపరి మూవీ ని చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది . అందులో భాగంగా పూరి జగన్నాథ్ ఇప్పటికే సల్మాన్ ఖాన్ కు ఒక కథను వినిపించగా , ఆ కథ బాగా నచ్చిన సల్మాన్ ఖాన్ కూడా వెంటనే పూరి జగన్నాథ్ దర్శకత్వం లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: