మెగాస్టార్ చిరంజీవి హీరో గా రూపొందుతున్న వాల్తేరు వీరయ్య సినిమా చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది. ఒక వైపు రవితేజ పై కీలక యాక్షన్ సన్నివేశాలు కూడా హైదరాబాదులో చిత్రీకరిస్తున్న విషయం మనకు తెలిసిందే.

అదే సమయంలో విదేశాల్లో చిరంజీవి పై పాట చిత్రీకరణ చేస్తున్నారు. అక్కడ ఇక్కడ ఒకే సారి చిత్రీకరణ చేస్తున్న నేపథ్యం లో సినిమా గురించి  ఒక రకమైన ఆసక్తికర చర్చ జరుగుతుంది. దాదాపు వారం రోజుల చిత్రీకరణ తర్వాత హైదరాబాద్ షెడ్యూల్ ని ముగించినట్లుగా మనకు సమాచారం అందుతుంది. రవితేజ పై చిత్రీకరణ పూర్తి చేయడం తో ఆయన షూటింగ్ పార్ట్ పూర్తి అయింది.

వాల్తేరు వీరయ్య లో విక్రమ్ సాగర్ పాత్ర పోషిస్తున్న రవి తేజ తన పాత్ర కు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు ముగించేసి తన సినిమా షూటింగ్ కి అతి త్వరలో జాయిన్ కాబోతున్నాడు అంటా మరీ, ప్రస్తుతం ధమాకా సినిమా యొక్క ప్రమోషనల్ కార్యక్రమాలలో పాల్గొంటున్నాడు. రవితేజసినిమా విడుదల అయిన తర్వాత వేరే సినిమా షూట్ లో పాల్గొంటారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా పై అంచనాలు రవితేజ పై భారీగా ఉన్నాయి అని చెప్పొచ్చు.

చిరంజీవి తో పాటు సినిమా లో మాస్ మహారాజా రవితేజసినిమా లో కీలక పాత్ర లో నటించడం వల్ల ప్రతి ఒక్కరీలో ఓ ఆసక్తి నెలకొంది. తప్పకుండా ఈ సినిమా ప్రతి ఒక్కరి అంచనాలకు తగ్గట్లుగా ఉంటుందని దర్శక నిర్మాతలు చెప్తున్నారు. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమా ను సంక్రాంతి కనుక జనవరి 13వ తారీఖున ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఈ సినిమాలో చిరంజీవి కి జోడి గా శృతి హాసన్ నటించిన విషయం  మనకూ తెలిసిందే. రవితేజ చాలా సంవత్సరాల తర్వాత చిరంజీవి సినిమాలో నటించడం వల్ల కూడా అంచనాలు భారీగా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: