
ఇప్పటికే తెలంగాణ కోసం హైదరాబాదులో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ పూర్తి చేయగా.. ఆంధ్రప్రదేశ్ కోసం తిరుపతిలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిపారు. అలాగే కోలీవుడ్ కి సంబంధించి చెన్నైలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చాలా ఘనంగా జరిపినట్లు తెలుస్తోంది . అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన రాజకీయాలపై కూడా క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కోలీవుడ్లో నడిగర్ సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతున్న విశాల్ రాజకీయాలపై స్పందిస్తూ.. తిరుపతి కుప్పం నుంచి పోటీ చేస్తామని అందరూ అనుకున్నారు కానీ రాజకీయాలలోకి వస్తాను అయితే కుప్పం నుంచి పోటీ చేయడం లేదు అని స్పష్టత ఇచ్చారు.
రావాల్సిన సమయంలో కచ్చితంగా రాజకీయాలలోకి వస్తాను కానీ సమయం పడుతుంది. ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్ లతో బిజీగా ఉండడంవల్ల రాజకీయాల వైపు ఆసక్తి చూపించలేకపోతున్నాను. త్వరలోనే సినిమా షూటింగ్లన్నీ పూర్తి చేసుకొని రాజకీయ రంగం వైపు అడుగులు వేస్తాను అంటూ తన మనసులో మాట బయటపెట్టారు విశాల్. విపరీతమైన అభిమానులను సొంతం చేసుకున్న విశాల్ రాజకీయ రంగంలో కూడా రాణించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఏది ఏమైనా త్వరలో విశాల్ రాజకీయ రంగంలోకి కూడా ప్రవేశించబోతున్నట్లు తెలుస్తోంది.