పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. దాదాపు ఈయన తెరకెక్కించిన ఎన్నో సినిమాలలో క్లాసికల్ మూవీలుగా మరికొన్ని చిరస్థాయిగా మిగిలిపోతాయి . అలాంటి వాటిల్లో ఖుషీ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమా ప్రేక్షకులను ఎంతలా మెప్పించింది అంటే ఇప్పటికీ ఎప్పటికీ అంతే కొత్తదనంతో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే ఈ సినిమా ప్రత్యేకత . ఇందులో నటించిన పవన్ కళ్యాణ్ , భూమిక తమదైన పాత్రలతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు ఇప్పటికీ ప్రేక్షకులు మర్చిపోలేరు అనడంలో సందేహం లేదు. అంతలా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది ఈ సినిమా. అంతే కాదు పవన్ కళ్యాణ్ , భూమిక సినీ కెరియర్ లోని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

తమిళంలో విజయవంతమైన కుశీ సినిమా రీమేక్ గా తెలుగులో ఎస్ జె సూర్య దర్శకత్వంలో 2001 ఏప్రిల్ 26వ తేదీన ఖుషి సినిమాను విడుదల చేయడం జరిగింది. కేవలం రూ.2.5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా భారీ స్థాయిలో వసూలు క్రియేట్ చేసి అరుదైన రికార్డు సృష్టించింది. బెస్ట్ యాక్టర్స్ గా నటీనటులకు ఫిలింఫేర్ అవార్డ్స్ కూడా లభించాయి. ఇదిలా ఉండగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ప్రస్తుతం ఎలాగో రీ రిలీజ్ సినిమాల హవా కొనసాగుతున్న నేపథ్యంలో ఖుషి సినిమా కూడా రిలీజ్ చేయడానికి మేకర్స్ డేట్ లాక్ చేయడం జరిగింది.

డిసెంబర్ 31వ తేదీన 4k విజన్ 5.1 డాల్బీ ఆడియోతో థియేటర్లలో ఖుషి సినిమాను రీ రిలీజ్ చేయడానికి సన్నహాలు చేస్తున్నారు.  ఈ విషయం తెలిసి అభిమానులు పెద్ద ఎత్తున సంతోషం వ్యక్తం చేస్తున్నారు అంతేకాదు ఈ సినిమాను ఫోర్కె లో రిలీజ్ చేయబోతుండడంపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారుఇప్పుడు పవన్ కళ్యాణ్ కి సంబంధించిన సినిమాల విడుదల ఏమీ లేవు కాబట్టి ఇయర్ ఎండ్ సందర్భంగా డిసెంబర్ 31న ఈ సినిమాను థియేటర్లలో ప్రదర్శించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: