
నటేశ్వర్ నృత్య కళా మందిర్ లో 2009 నుండి కథక్ నేర్చుకుంటున్నారు కంగనా. నటిగానే కాదు సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటుంది.
మహిళలపై జరిగే అక్రమాలు, అన్యాయాలపై గళమెత్తుతుంది. ఇటీవల మీటూ విషయంలో పెద్ద ఎత్తున పోరాడింది. అంతేకాదు ఇండస్ట్రీలో తాను కూడా కాస్టింగ్ కౌచ్ కి బలి అయ్యానని పలుమార్లు బహిరంగంగానే తన బాధ వ్యక్తం చేసింది. కంగనా ఇప్పటివరకూ మూడు జాతీయ పురస్కారాలు, నాలుగు ఫిలింఫేర్ పురస్కారాలు అందుకున్నారు. కంగనాకు అక్క రంగోలీ, తమ్ముడు అక్షత్ ఉన్నారు.
అయితే ముంబైలో ఆమె అక్క రంగోలీతో కలసి ఉంటారు కంగనా. కంగనా బాలీవుడ్ లోనే కాదు ఇటీవల తమిళ ఇండస్ట్రీలో కూడా తన సత్తా చాటుతుంది. ప్రస్తుతం ఈ భామ తమిళంలో చంద్రముఖి 2 సినిమాలో నటిస్తోంది.
గత కొంత కాలంగా దేశ వ్యాప్తంగా యాసిడ్ దాడులు పెరుగుతున్నాయని.. గతంలో తన అక్క రంగోలిపై యాసిడ్ దాడి జరిగింది.. తనకు 52 శస్త్ర చికిత్సలు జరిగాయని గుర్తు చేసింది. మొదట తన సోదరి రంగోలీ మానసికంగా కృంగిపోయిన్పటికీ తర్వాత మనోధైర్యంతో తన జీవితాన్ని మంచిగా తీర్చిదిద్దుకుంది. ఆ సంఘటన తర్వాత తనపై కూడా యాసిడ్ దాడి జరుగుతుందని భయపడుతున్నట్లు చెప్పింది. అంతేకాదు ఇప్పటికీ బయటకు వెళ్తే తన ముఖం చేతులతో దాచుకుంటానని తెలిపింది. బాలీవుడ్ సెలబ్రిటీస్ ని టార్గెట్ చేస్తూ హాట్ న్యూస్ లో ఉంటుంది కంగనా.