తెలుగు సినీ హీరోయిన్ లలో ఎప్పటికి కూడా చెప్పుకునే పేరు మహానటి సావిత్రి. తెలుగు సినీ చరిత్ర ఆమెను మహానటి అని పిలిచింది.. నటనలో ఆమెకు పోటీ వచ్చే వారు అస్సలు లేరు.

తన న్యాచురల్ నటనతో చాలా మంది ఫ్యాన్స్ ను పొందారు నటి సావిత్రి గారు.అలనాటి స్టార్స్ కు ధీటుగా నటించే వారు సావిత్రి. ఎన్టీఆర్ మరియు ఏఎన్ఆర్ అలాగే ఎస్వీ రంగారావు లాంటి లెజెండ్స్ ప్రశంసలను అందుకున్నారు మహానటి సావిత్రి. సావిత్రి గారి డేట్స్ అస్సలు దొరికేవి కావు ఆసమయంలో.. సినీ తెర పై వెలిగిన సావిత్రి జీవితంలో కొంత చీకటి కూడా ఉంది. ఆమె చేసిన కొన్ని తప్పులు ఆమెకు శాపంగా మారాయని చెప్పవచ్చు.. అద్భుతమైన సేవా గుణంలోనూ సావిత్రికి పోటీ వచ్చే వారు లేరు..కష్టాల్లో ఉన్నవారికి తన వంతు సాయం చేసేవారు సావిత్రి. జెమిని గణేష్ ను పెళ్లి చేసుకున్న తర్వాత సావిత్రి జీవితం అంతా కూడా చిన్నా భిన్నం అయ్యింది. అదే సమయంలో ఆమె తాగుడుకి బానిస అయ్యినట్లు సమాచారం..అయితే మహానటి సావిత్రి గారి గురించి అలనాటి నటి అయిన జమున గారు చెప్పిన మాటలు ఇప్పుడు మళ్ళీ బాగా వైరల్ అవుతున్నాయి. ఒక ఇంటర్వ్యూ లో జమున గారు మాట్లాడుతూ.. సావిత్రి గురించి బాధ పడ్డారు.. జమున సావిత్రి ఇద్దరు కూడా ఎప్పుడు అక్క చెల్లెళ్లుగా ఉండేవారు. ఒకసారి సావిత్రి బాగా మద్యం తాగి వచ్చారని చెప్పారు జమున.

ఆమె వివరిస్తూ తన కొడుకు బారసాల కు సావిత్రిని ఇంటికి పిలిచాను.. అప్పుడు సావిత్రి బాగా తాగేసి వచ్చింది . మా కొడుకుని ఎత్తుకొని కూడా ఆడించింది. ఆ తర్వాత నన్ను ఒక రూమ్ లోకి తీసుకెళ్లి బాగా ఏడ్చింది.. నన్ను గట్టిగా పట్టుకొని బాగా ఏడ్చేసింది. నువ్వు చాలా మంచిదానివే .చెల్లి. మంచి భర్త,కొడుకు కమ్మని సంసారం..చాలా ఆనందంగా ఉంది..నాకు మాత్రం ఈ సంతోషం లేదు అంటూ బాగా కన్నీళ్లు పెట్టుకుంది. ఆతర్వాత తన భర్త జెమినీ గురించి అతడి తప్పుల గురించి చెప్పి చాలా ఏడ్చేసింది అన్నారు. అప్పుడు నేను తనని ఓదార్చే ప్రయత్నం చేశాను.ఇద్దరు చక్కని పిల్లలున్నారు నీకు మంచి జరుగుతుంది అంటూ చెప్పుకొచ్చారు జమున గారు.

మరింత సమాచారం తెలుసుకోండి: