
షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ రిలీజ్ కి రెడీ అవుతోంది. రీసెంట్ గా ఫస్ట్ లుక్ కాన్సెప్ట్ పోస్ట ర్ నిరిలీజ్ చేసిన మేకర్స్ తాజాగా బుధవారం ఈ మూవీ నుంచి గ్లిమ్స్ ని `వరల్డ్ ఆఫ్ బెదురులంక` పేరుతో విడుదల చేశారు. ఓ పల్లెటూరిలో 2012 యుగాంతం నేపథ్యంలో సాగే కథ గా `బెదురులంక 2012` చిత్రాన్ని ఓ విభిన్నమైన కథ కథనాలతో రూపొందిస్తున్నారు. తాజాగా విడుదల చేసిన గ్లిమ్స్ వీడియోలో బెదురులంక గ్రామానికి చెందిన పాత్రలని పరిచ యం చేశారు. విశాలమైన గోదావరి తీరంలో పచ్చటి కొబ్బరి చెట్ల మధ్యలో మనుషులు.. బండిమీద దూసుకు వెళుతున్న కార్తికేయ.. ఊరు ఎలా వుటుందో వీడియో ప్రారంభంలో చూ పించిన తీరు ఆకట్టుకుంటోంది.
కళ్లకు కనిపించే విజువల్స్.. వినిపించీ వినిపించని డైలాగ్స్ .. బెదురులంకలో నిజంగానే ఏదో మా య జరుగుతోందనే భ్రమని కలిగిస్తున్నాయి. అయ్ బాబోయ్ ఆగలేం రోయ్ వచ్చేయండ్రోయ్.. అంటూ సాగే డైలాగ్స్.. గోదావిరి తీరంలోని టెంట్ లో ఏర్పాటు చేసిన ఫుడ్ పై జ ఎగబడి తిం టున్న తీరు... వర్షం పడు తుండగా ప్రేమ కోసం పరితపిస్తూ చేరువవుతున్న ప్రేమ జంట...అజజ్ఞ్ ఘోష్ కుమార్ కసిరెడ్డి గోపరాజు రమణ పాత్రల పరిచయం.. యుగాంతం వస్తోందని ఊరిలో ప్రజలు అంతా ఎంజాయ్ చేస్తున్న తీరు నవ్వులు పూయిస్తోంది.