హీరోయిన్ గా సక్సెస్ అవడం అంటే అది అంత ఈజీ థింగ్ ఏం కాదు. వచ్చిన ఛాన్స్ లను వాడుకునే కథానాయికలు కొంతమంది అయితే.. తమకు రావాల్సిన ఛాన్స్ ల కోసం రకరకాల ప్రయత్నాలు చేసే బ్యాచ్ కొందరు. ఎలా వచ్చినా సరే అవకాశం వచ్చింది అంటే అది అందరికి ఉపయోగపడుతుంది. అలానే మొదటి సినిమాతోనే పాన్ ఇండియా హీరోయిన్ గా ముద్ర వేసుకోవడం లక్కీ అని చెప్పొచ్చు. అది హీరోయిన్ శ్రీనిధి శెట్టి కి జరిగింది. మోడల్ గా చేస్తూ తెరంగేట్రం చేసిన ఫస్ట్ సినిమానే పెద్ద సెన్సేషన్ అయ్యింది. కె.జి.ఎఫ్ చాప్టర్ 1, 2 సినిమాలతో అమ్మడి రేంజ్ ఎక్కడికో వెళ్లింది.

సినిమా తర్వాత విక్రం తో కోబ్రా ఛాన్స్ అందుకున్నా సరే అది కాస్త తుస్సుమన్నది. కె.జి.ఎఫ్ లాంటి హిట్ కొట్టిన హీరోయిన్ కి ఈపాటికి చేతినిండా సినిమాలు ఉండాలి. అరడజను సినిమాల దాకా సైన్ చేసి ఉండాల్సింది. కానీ శ్రీ నిధి మాత్రం కనీసం ఒక్క సినిమాకు కూడా ఓకే చెప్పలేదు. దానికి కారణం అమ్మడు అడుగుతున్న భారీ రెమ్యునరేషన్ అని తెలుస్తుంది. కె.జి.ఎఫ్ లో ఆమె హీరోయినే కానీ ఆమె వల్ల కె.జి.ఎఫ్ హిట్ అయ్యిందని మాత్రం యాక్సెప్ట్ చేయట్లేదు.

అందుకే కె.జి.ఎఫ్ హీరోయిన్ గా ఆమె సినిమాకు 2 కోట్ల దాకా డిమాండ్ చేస్తుందట. కానీ దర్శక నిర్మాతలు మాత్రం ఆమెకి కోటి కన్నా ఎక్కువ ఇచ్చే ఆలోచనలో లేరని తెలుస్తుంది. ఇలానే శ్రీనిధి శెట్టి దగ్గరకు రెండు మూడు ఛాన్స్ లు వచ్చినట్టే వచ్చి చివరి నిమిషంలో చేజారాయట. కేవలం రెమ్యునరేషన్ వల్లే అమ్మడు ఛాన్స్ లు వదులుకుంటుందని టాక్. అయితే పెరిగిన స్టార్ కాస్టింగ్ ని బట్టి.. ప్రొడక్షన్ వాల్యూస్ ని బట్టి చూస్తే శ్రీ నిధి డిమాండ్ చేసే మొత్తం కూడా అంత పెద్దా ఎమౌంట్ ఏమి కాదని అంటున్నారు. అయితే తను కోరిన పారితోషికం ఇస్తేనే తను సినిమాలు చేస్తానని భీష్మించుకు కూర్చుందట శ్రీ నిధి. మరి అమ్మడు ఈ టైం లో ఇలా పట్టు పట్టడం కూడా కెరీర్ కి కరెక్ట్ కాదని చెప్పొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: