ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎలాంటి పాత్రలోనైనా సరే జీవించగలిగే ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడిప్పుడే తన కెరీర్ను పాతాళం వైపు తీసుకెళ్తుందని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏ మాయ చేసావే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన సమంత ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు అందరితో కూడా కలిసి నటించి మెప్పించింది. అదేవిధంగా నాగచైతన్య ను ప్రేమించి మరీ వివాహం చేసుకున్న సమంత.. నాలుగేళ్ల తర్వాత విడాకుల పేరిట అతడికి దూరమయింది. ఆ తర్వాత ఆమెకు పెద్దగా కలిసి రాలేదని చెప్పాలి.

నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత ప్రతి విషయంలో కూడా ఆచితూచి ఆలోచనలు చేయడం లేదని వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి.  ఈ క్రమంలోనే వరుసగా బాలీవుడ్ చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఈమె అందులో ఒక చిత్రంలో కూడా నటించలేదు.  ఇటీవల ఈమె నటించిన యశోద సినిమా సమయంలో తనకు మయో సిటీస్ అనే భయంకరమైన వ్యాధి సోకింది అని మీడియాతో తానే స్వయంగా వెల్లడించింది. అంతేకాదు ఒకవైపు ఆ సమస్యతో బాధపడుతుండగానే మరొకవైపు యశోద సినిమా డబ్బింగ్ పూర్తి చేసింది. అయితే ఇప్పుడు వ్యాధి మరింత తీవ్రతరం అవడంతో ఆమె మరింత మెరుగైన చికిత్స కోసం దక్షిణ కొరియా వెళ్లినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. సమంతా చేతిలో కేవలం విజయ్ దేవరకొండ తో నటిస్తున్న ఖుషి సినిమా మాత్రమే ఉంది అని సమాచారం అంతేకాదు.. తన ఆరోగ్య రీత్యా.. రెండు ప్రముఖ వాణిజ్య సంస్థల బ్రాండ్ల నుంచి తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈమె చేతిలో ఖుషి సినిమా తప్ప మరో ప్రాజెక్టు లేదు.  ఈ విషయం బట్టి చూస్తే క్రమంగా సమంత కెరియర్ ముగిసిపోతోందా అంటూ అభిమానులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ..అంతేకాదు ఆమె త్వరగా కోలుకొని త్వరగా సినిమా అనౌన్స్మెంట్ చేయాలను కూడా ఆశిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: