టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కొన్ని ప్రేమ కథలకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అలానే గీతాంజలి, తొలిప్రేమ వంటి సినిమాలు ఎంతటి విజయాన్ని అందుకున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఈ సినిమాలాగే అక్కినేని నాగచైతన్య మరియు సమంత జంటగా నటించిన ఏం మాయ చేసావే సినిమా కూడా అంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. అప్పట్లో ఈ సినిమా ఎంతటి కలెక్షన్లను సాధించిందో మనందరికీ తెలిసిందే. ఇక నాగచైతన్య మరియు సమంత జంటగా నటించిన ఈ సినిమా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కింది.

 సమంత నటించిన మొదటి సినిమా ఇది. ఈ సినిమాతో సమంత క్రేజ్ ఎంతలా మారిపోయింది అంటే దాని అనంతరం వరుస స్టార్ హీరోల సరసన హీరోయిన్గా నటించింది. ఇక అదే సినిమాతో మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు చైతన్య. వీరిద్దరూ కలిసి జంటగా నటించిన ఈ సినిమాతో బెస్ట్ కపుల్ గా కూడా పేరు తెచ్చుకున్నారు. దాని అనంతరం ఈ సినిమా తోనే ప్రేమించుకున్న నాగచైతన్య సమంత చాలా ఇళ్ల తర్వాత పెళ్లి కూడా చేసుకున్నారు. కాని ఇటీవల ఎవరూ ఊహించని విధంగా వీరిద్దరూ విడాకులు కూడా తీసుకోవడం జరిగింది. పెళ్లయిన 4 ఏళ్ళకి వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు.

ప్రస్తుతం ఎవరి వ్యక్తిగత జీవితాలలో వారు బిజీగా ఉన్నారు. అయితే తాజాగా వీరిద్దరూ జంటగా నటించిన ఏం మాయ చేసావే సినిమాకి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఏం మాయ చేసావే సినిమాకు సీక్వెల్ ఉన్నట్లుగా తెలుస్తోంది. తాజాగా గౌతమ్ మీనన్ ఈ సినిమాకి సంబంధించిన సీక్వెల్ను సిద్ధం చేస్తున్నట్లుగా చెప్పడం జరిగింది. స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని త్వరలోనే ఈ సినిమా ప్రారంభం కాన ఉందని చెప్పవచ్చాడు. ఇక ఈ సినిమాలో సమంత ప్లేస్ లో రష్మిక ను హీరోయిన్ గా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమా సీక్వెల్ కూడా నాగచైతన్య సమంత విడిపోయిన తర్వాత వారి జీవితాలు ఎలా ఉన్నాయి అన్న నేపథ్యంలోనే ఉంటుంది అన్నట్లుగా తెలుస్తోంది ..!!

మరింత సమాచారం తెలుసుకోండి: