సోషల్ మీడియాలో ఒక వార్త బాగా వైరల్ అవుతుంది. ఇంతకీ అసలు సంగతి ఏమిటంటే.. హీరో నాని విడిపోయిన అక్కినేని నాగచైతన్య సమంతలను కలపబోతున్నారని సమాచారం.. ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో బాగా వినిపిస్తోంది. మరి ఇంతకీ అసలు సంగతి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అడివి శేష్ హీరోగా వచ్చిన హిట్ 2 సినిమా ఈ మధ్యనే విడుదల అయి ఎంత పెద్ద సక్సెస్ అయిందో మనకు బాగా తెలిసిందే. ఇక ఈ సినిమాకి నిర్మాతగా హీరో నాని వ్యవహరించారని కూడా తెలిసిందే.

ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హిట్ 3 కూడా ఉంటుందని అందులో హీరో నాని (Nani) నే అని ఇప్పటికే హిట్ 2 చూసిన వారికీ తెలిసిపోతుంది.. హిట్ 2కి సంబంధించిన క్లైమాక్స్ సీన్ లో త్వరలోనే హిట్ 3 కూడా ఉంటుందని డైరెక్టర్ హింట్ కూడా ఇచ్చాడు.. అంతేకాదు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ సినిమా డైరెక్టర్ హిట్ సినిమాకి 7 సీక్వెల్స్ ఉంటాయని కూడా చెప్పుకొచ్చారని సమాచారం.. ఇక హిట్1 సినిమాలో విశ్వక్సేన్ హీరోగా నటిస్తే,హిట్ 2 సినిమాలో అడివి శేష్ (Adivi Sesh) హీరోగా చేసారు.ఇక హిట్ 3 సినిమాకి నాని హీరోగా చేస్తారని తెలుస్తుంది.

అయితే హిట్ 3 సినిమా గురించి ప్రస్తుతం లేటెస్ట్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. అదేంటంటే.. హిట్ 3 (Hit 3) సినిమాలో కూడా అడివి శేష్ ఒక కీలక పాత్రలో నటించబోతున్నారని సమాచారం.. అంతేకాకుండా ఆ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో నటించడానికి  సమంత నాగచైతన్యను మళ్లీ ఆ సినిమా ద్వారా ఓకే స్క్రీన్ పై చూపించాలనుకుంటున్నారని తెలుస్తుంది.. ఇక తన అడవి శేష్ ఈ ఉద్దేశాన్ని హీరో నాని (Nani) కి చెప్పి ఎలాగైనా మీరు సమంత నాగచైతన్యలను ఒప్పించి హిట్ 3 సినిమాలో నటించేలా చేయాలి అని కూడా చెప్పారట.

అయితే వీళ్ళిద్దరూ నటించే ఆ సినిమాలో వీరి పాత్ర చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని సోషల్ మీడియాలో ఒక క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఇక ఈ సినిమా కోసం హీరో నాని సమంత నాగచైతన్య (Samantha- naga Chaithanya) లను ఒప్పించే పనిలో వున్నారట. వీరిద్దరూ సినిమాలో కలిసి నటిస్తే వారి అభిమానులు బాగా సంతోషపడతారు.కానీ వీరిద్దరూ కలవడం అనేది జరగడం కష్టమే.ఒకవేళ కలిస్తే మాత్రం ఈ సినిమా ఖచ్చితంగా పెద్ద హిట్ అని చాలామంది అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: