ఈ సంక్రాంతికి చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య.. బాలకృష్ణ నటిస్తున్న వీరసింహారెడ్డి సినిమాలు పోటీ పడబోతున్న విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాలతో పాటు దిల్ రాజు నిర్మించిన తెలుగు, తమిళ్ సినిమా వారసుడు కూడా విడుదల కాబోతోంది. అలాగే తన వారసుడు సినిమాకు సాధ్యమైనన్ని ఎక్కువ థియేటర్లు తీసుకున్న తర్వాత మాత్రమే తాను ఇతర సినిమాలకు థియేటర్లు ఇస్తాను అంటూ ప్రకటించి వివాదాలకు తెర లేపాడు దిల్ రాజు.. అంతేకాదు తను సినిమాకు థియేటర్లో లేకుండా ఇతర హీరోల సినిమాలకు థియేటర్లు ఇచ్చే అంత మంచి మనసు తనది కాదు అన్నట్లుగా కూడా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు..

ఒకరకంగా చెప్పాలి అంటే అధికారికంగా వాల్తేరు వీరయ్య వీర సింహారెడ్డి సినిమాలకు ఎక్కువ థియేటర్లు ఇవ్వబడడం లేదు అన్నట్లుగా ప్రకటించాడు. ఇకపోతే భారీ ఎత్తున అంచనాలు ఉన్న  ఈ రెండు సినిమాలను కాదని తక్కువ క్రేజ్ వున్న  వారసుడు సినిమాకు ఎక్కువ థియేటర్లు ఇవ్వాలని దిల్ రాజు నిర్ణయించుకున్నాడు. అయితే ఇక్కడ మరొక ట్విస్ట్ ఏమిటంటే విజయ్ అజిత్ కంటే గొప్ప అని మొన్నటి వరకు పలు సంచలన కామెంట్లు చేసిన దిల్ రాజు  ఇప్పుడు అజిత్ సినిమాని కూడా నైజాం, వైజాగ్  ఏరియాలో డిస్ట్రిబ్యూట్ చేయడానికి హక్కులను సొంతం చేసుకున్నాడు.

అజిత్ హీరోగా రూపొందిన ఈ సినిమాను హెచ్ వినోద్ దర్శకత్వం వహించారు.తమిళనాడు రూ. 100 కోట్లకు పైగా వసూలు నమోదు చేయడం ఖాయం అంటూ అంతా నమ్మకంగా ఉన్నారు.  ఈ సమయంలోనే ఆ సినిమాను కూడా తెలుగులో దిల్ రాజు విడుదల చేస్తానంటూ రైట్స్ ను  కొనుగోలు చేయడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు.  ఇదేంటి ఇప్పటికే వారసుడు సినిమాతో ఆ రెండు సినిమాలకు ఎసరు పెట్టినట్లుగా ఉంటే ఇప్పుడు మరో సినిమాను తీసుకొస్తే చిరు,  బాలయ్య సినిమాలకు థియేటర్ల పరిస్థితి ఏంటి అంటూ మరి కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై దిల్ రాజు ఎలా స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: