టాలీవుడ్ క్రేజీ కపుల్స్ విజయ్ దేవరకొండ, రష్మిక ల మధ్య సంథింగ్ సంథింగ్ అన్న విషయం అందరికి తెలిసిందే. వారు కూడా ఈ మ్యాటర్ పై ఓపెన్ కామెంట్ చేయకుండా సైలెంట్ గా ఉంటారు. విజయ్ తన సినిమాలతో దూసుకెళ్తుంటే.. రష్మిక టాలీవుడ్ బాలీవుడ్ తేడా లేకుండా అదరగొట్టేస్తుంది. విజయ్, రష్మిక ల మధ్య సీక్రెట్ స్టోరీ నడుస్తుందని అందరు అనుకుంటున్న మాటే.

ఇక వేడుక ఏదైనా.. అకేషన్ ఏదైనా ఇద్దరు కలిసి సీక్రెట్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. లేటెస్ట్ గా మరోసారి ఈ ఇద్దరు కలిసి న్యూ ఇయర్ పార్టీ ఎంజాయ్ చేసినట్టు తెలుస్తుంది. న్యూ ఇయర్ కోసం విజయ్ మాల్దీవ్స్ వెళ్లినట్టు తెలుస్తుండగా సరిగా అక్కడే రష్మిక కూడా ఉన్నట్టు అర్ధమవుతుంది. ఇద్దరు వేరు వేరు ఫోటోలు పెట్టినా అవి రెండు బాగా గమనిస్తే మాత్రం ఇద్దరు ఒకచోటే ఉన్నట్టు క్లారిటీ వస్తుంది.

మరి ఇలా సీక్రెట్ గా ఎందుకు వారిద్దరు రిలేషన్ లో ఉన్నామని చెప్పి ఎంజాయ్ చేస్తే బెటర్ కదా అని అంటున్న వారు ఉన్నారు. విజయ్, రష్మిక ఇద్దరు కలిసి గీతా గోవిందం సినిమా చేశారు. ఆ సినిమా టైం లో ఇద్దరు క్లోజ్ అవగా మరోసారి డియర్ కామ్రెడ్ కి కలిసి పనిచేశారు. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోలేదు. కలిసి సినిమాలు చేయకపోయినా విజయ్, రష్మిక ఇద్దరు సీక్రెట్ గా లవ్ స్టోరీ నడిపిస్తున్నట్టు మాత్రం అర్ధమవుతుంది. కానీ విజయ్ రష్మిక లు మాత్రం ఈ విషయంపై అసలు నోరు విప్పరు. మరి వ్యవహారం ఎందాకా వెళ్తుంది అన్నది చూడాలి. ఎవరి సినిమాలతో వారు కెరీర్ బిజీగా ఉన్నా సరే విజయ్ రష్మిక ఇద్దరు తమ స్పేస్ లో కలిసి ఎంజాయ్ చేస్తున్నారని టాక్. విజయ్ ప్రస్తుతం ఖుషి సినిమా చేస్తుండగా రష్మిక వారసుడుతో సంక్రాంతికి రాబోతుంది.  




 


మరింత సమాచారం తెలుసుకోండి: