టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం మల్టీస్టారర్ సినిమాల హవా నడుస్తుంది అన్న విషయం తెలిసిందే. ఒక హీరోతో సినిమా తీస్తే కేవలం ఒక హీరో అభిమానులు మాత్రమే చూస్తారు. అదే ఇద్దరు స్టార్ హీరోలను పెట్టి సినిమా తీస్తే కాస్త బడ్జెట్ ఎక్కువైన పర్వాలేదు. కానీ అభిమానుల నుంచి ఎక్కువ ఆదరణ లభిస్తుంది అని దర్శక నిర్మాతలు కూడా ప్లాన్ చేస్తున్నారు. దీంతో అభిమానులు కావాలనుకుంటున్న మల్టీ స్టార్స్ ని ఒక సినిమాలో చేర్చి సినిమా తీసి సూపర్ హిట్ కొడుతూ ఉండడం ఇటీవల కాలంలో చూస్తూనే ఉన్నాం అన్న విషయం తెలిసిందే.


 ఇక ఇటీవల కాలంలో అటు మాస్ మహారాజా రవితేజ సైతం మల్టీస్టారర్ సినిమాల వైపు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నాడు అన్నది తెలుస్తుంది. ఇప్పటికే హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా రవితేజ వరుస సినిమాలతో దూసుకుపోతూ ఉన్నాడు. 2022 ఏడాదిలో రెండు విజయాలు సాధించాడు రవితేజ. క్రాక్ సినిమాతో సంక్రాంతికి వచ్చి బ్లాక్ బస్టర్ కొట్టిన రవితేజ.. మొన్నటికి మొన్న ఇక ఏడాది చివరిలో దమాకా సినిమాతో ధమాకా లాంటి సూపర్ హిట్ అందుకున్నాడు అని చెప్పాలి. అదే సమయంలో ఇక మల్టీ స్టార్ సినిమాలపై కూడా ఎక్కువగా ఆసక్తి చూపుతున్నాడు.


 ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా కోసం ఒక కీలకపాత్రలో నటించేందుకు సిద్ధమయ్యాడు. అయితే ఇందుకోసం అటు రవితేజ భారీగానే డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పుడు మరో మల్టీస్టారర్ కి రవితేజ ఓకే చెప్పేసాడు అంటూ టాలీవుడ్ వర్గాలు ప్రచారం జరుగుతుంది. ఇక ఈ సినిమా కోసం వాల్తేరు వీరయ్య సినిమా తరహాలోనే భారీగా రెమ్యూనరేషన్ కూడా ఫిక్స్ అయిపోయిందట. ఇక పాత్ర నిడివి కూడా ఇంచుమించు అంతే ఉంటుందని సమాచారం. అయితే ఈసారి యంగ్ హీరో సినిమాలో రవితేజ స్పెషల్ రోల్ లో కనిపిస్తాడట. మరికొన్ని రోజుల్లో ఇందుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ బయటికి వస్తాయని టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: