ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఎక్కువగా వినిపిస్తున్న రెండు పేర్లు — ఒకటి రష్మిక మందన్నా, మరొకటి స్టార్ హీరో విజయ్ దేవరకొండ. ఈ ఇద్దరు టాలీవుడ్ స్టార్స్ నిశ్చితార్థం చేసుకున్నారనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వీళ్ళిద్దరూ కలిసి నటించిన ‘గీతా గోవిందం’ సినిమా ద్వారా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో, రష్మిక మరియు విజయ్ ఇద్దరికీ కెరీర్‌లో మలుపు తీసుకువచ్చింది. అప్పటివరకు రష్మిక అంటే ఒక ఇమేజ్, గీతా గోవిందం తర్వాత రష్మిక అంటే మరో స్థాయికి వెళ్లిపోయింది. అదే విధంగా విజయ్ దేవరకొండకు కూడా అర్జున్ రెడ్డి తర్వాత అంత భారీ విజయాన్ని ఇచ్చిన సినిమా ఇదే అని చెప్పుకోవాలి.


సినిమా షూటింగ్ సమయంలో మొదలైన వీరి స్నేహం ఆ తర్వాత ప్రేమగా మారిందనే గుసగుసలు అప్పట్లోనే వినిపించాయి. ఇప్పుడు ఆ ప్రేమ నిశ్చితార్థం దాకా వెళ్లిందని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. వీళ్ళిద్దరి కెమిస్ట్రీ ఆన్‌స్క్రీన్‌లో ఎంత నేచురల్‌గా ఉందో, ఆఫ్‌స్క్రీన్‌లో కూడా అంతే బలంగా ఉందని ఫ్యాన్స్ అంటున్నారు. ఇక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే — ‘గీతా గోవిందం’ సినిమాలో మొదట హీరోయిన్‌గా రష్మిక కాదు, మెగా కోడలు లావణ్య త్రిపాఠినే అనుకున్నారట. దర్శకుడు పరశురామ్ ముందుగా లావణ్యను ఈ పాత్ర కోసం సంప్రదించారట. అయితే సినిమాలో లిప్‌లాక్ సీన్లు ఉన్నాయనే కారణంతో ఆమె ఆ ఆఫర్‌ను తిరస్కరించిందట. అలా ఆ ఛాన్స్ రష్మిక మందన్నా ఖాతాలో పడింది.



ఫ్యాన్స్ సరదాగా “లావణ్య ఆ పాత్రను వదులుకోకపోయి ఉంటే, రష్మిక–విజయ్ జంటగా మారేవాళ్లు కాదేమో!” అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. పరోక్షంగా లావణ్య త్రిపాఠినే  రష్మిక–విజయ్ ప్రేమకథకు కారణమన్నట్టుగా అభిమానులు హాస్యంగా మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారి, ట్విట్టర్ నుండి ఇన్‌స్టాగ్రామ్ వరకూ విపరీతంగా వైరల్ అవుతోంది. రష్మిక–విజయ్ ఫ్యాన్స్ మాత్రం ఓ రేంజ్ లో ఫుల్ ఖుషి అవుతున్నారు. వీళ్లిద్దరు ఎప్పుడు ఇలా హ్యాపీగా ఉండాలి అంటూ కోరుకుంటున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: