మలయాళ భామ అనుపమ పరమేశ్వరన్ ఈమధ్య మళ్లీ కెరీర్ లో బిజీ అయ్యింది. టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కొత్త లో ఆడియన్స్ ని అలరించిన అమ్మడు మధ్యలో తన సైజ్ తగ్గించుకుని అందరికి షాక్ ఇచ్చింది. స్లిం లుక్ మాత్రమే కాదు గ్లామర్ షోతో కూడా రెచ్చిపోతుంది అనుపమ. లాస్ట్ ఇయర్ కార్తీకేయ 2, 18 పేజెస్ సినిమాలతో హిట్ అందుకుంది అనుపమ. రీసెంట్ గా బటర్ ఫ్లై అనే సినిమాతో కూడా అలరించింది అనుపమ.

ఇక వరుస సినిమాలు.. వాటి ఫలితాలు కూడా బాగుండటంతో అమ్మడి రేంజ్ పెరిగింది. అందుకే అనుపమ తన రెమ్యునరేషన్ కూడా పెంచేసిందని తెలుస్తుంది. అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం తీసుకుంటున్న పారితోషికం కోటికి అటు ఇటుగా ఉండగా ఇప్పుడు సినిమాకు కోటిన్నర నుంచి రెండు కోట్ల దాకా డిమాండ్ చేస్తుందని తెలుస్తుంది. ప్రస్తుతం ఫాం లో ఉంది కాబట్టి ఆమె అడిగినంత ఇచ్చేస్తున్నారు నిర్మాతలు. రౌడీ బోయ్స్ సినిమాలో కొత్త హీరోకి కూడా లిప్ లాక్ ఇచ్చి షాక్ ఇచ్చిన అనుపమ ఇక మీదట ఎలాంటి పాత్రల్లో అయినా నటించేందుకు రెడీ అనేస్తుంది.

తీసుకునే రెమ్యునరేషన్ కి న్యాయం చేయాలని ఫిక్స్ అయిన అనుపమ పరమేశ్వరన్ సినిమాల్లో హాట్ గా కనిపించడానికి సై అంటుంది. నిఖిల్ తో వరుస రెండు సినిమాలు చేసిన అనుపమ కార్తికేయ 3లో కూడా ఉంటుందని టాక్. ఇదే కాదు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ లకు మాత్రం రెమ్యునరేషన్ విషయంలో తగ్గేదేలే అనేస్తుంది అమ్మడు. మరి అనుపమ పెంచిన రెమ్యునరేషన్ తో ఆఫర్లు అందుకుంటుందా లేదా అన్నది చూడాలి. ఆమె సినిమాలతో అనుపమ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఈమధ్య 18 పేజెస్ ఈవెంట్ లో సుకుమార్ కూడా అనుపమ తో కలిసి పనిచేయాలని ఉందని అన్నాడు. చూస్తుంటే అనుపమ నెక్స్ట్ బిగ్ ఛాన్స్ అందుకునేలా ఉందని చెప్పొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: