తెలుగు సినీ ఇండస్ట్రీలో సెకండ్ జనరేషన్లో స్టార్ హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్న వారిలో చిరంజీవి, బాలకృష్ణ కూడా ఒకరు. ముఖ్యంగా వీరిద్దరి మధ్య ఎక్కువగా పోటీ ఉంటుంది. ఇప్పటికే 8సార్లు సంక్రాంతి బరిలో పోటీ పడగా ఐదుసార్లు సాధారణ రోజుల్లో బాక్సాఫీస్ వద్ద పోటీపడ్డారు. చివరిగా 2017లో బాక్స్ ఆఫీస్ వద్ద చిరంజీవి ఖైదీ నెంబర్ 150, బాలకృష్ణ గౌతమీపుత్ర శాతకర్ణ సినిమాలతో పోటీపడ్డ విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత అప్పటినుంచి వీరిద్దరి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడలేదు . అయితే ఇప్పుడు దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత మళ్లీ సంక్రాంతి పండుగ సందర్భంగా పోటీ పడబోతున్నట్లు తెలుస్తోంది.

చిరంజీవి బాబి డైరెక్షన్లో నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా అలాగే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న వీరసింహారెడ్డి సినిమాలు ఒక్కరోజు తేడాతో సంక్రాంతి బరిలో దిగబోతున్నాయి. ఇకపోతే వాల్తేరు వీరయ్య సినిమా జనవరి 13 , బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమా జనవరి 12న విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్ ల డేట్లు కూడా ప్రకటించారు. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే సినిమా ప్రమోషన్స్ విషయంలో చిరంజీవి కంటే బాలయ్య వెనుకబడ్డాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి.


ఇటీవల నటీనటులు సిబ్బంది అంతా మీడియాతో జరిగిన ప్రశ్నోత్తరాల కార్యక్రమానికి హాజరయ్యారు. అలాగే డైరెక్టర్ బాబీ ఆన్ లైన్లోనే కాకుండా ఆఫ్ లైన్లో కూడా చిరంజీవి అభిమానులతో నిరంతరం టచ్ లో ఉంటున్నాడు. కానీ వీర సింహారెడ్డి సినిమాకు సంబంధించి ఇప్పుడు ఎటువంటి ప్రమోషన్స్ చేపట్టకపోవడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాలకృష్ణ నేరుగా అన్ స్టాపబుల్ షో కి జనవరి 8వ తేదీన తన టీమ్ ను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఒక్క ఎపిసోడ్ తో పాపులారిటీ పెంచే ప్రయత్నం కూడా బాలయ్య చేయబోతున్నారట. మరి ఈ ఇద్దరిలో ఎవరిది పై చేయి అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: