టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో క్యూట్ కపుల్ గా పేరు తెచ్చుకున్న సమంత మరియు నాగచైతన్య విడాకు కులు తీసుకొని ప్రస్తుతం ఎవరి జీవితాల్లో వారు బిజీగా ఉన్నారు. ఇక విడాకుల అనంతరం సమంత ప్రస్తుతం సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అయితే ఈ  నేపథ్యంలోనే సమంతకి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అయితే సమంత నాగచైతన్య నుండి విడాకులు తీసుకున్నప్పటికీ చైతు జ్ఞాపకాల నుండి ఇంకా బయటకు రాలేక పోతుంది అని అంటున్నారు.విడాకుల అనంతరం సమంత మానసికంగా అసలు బాగాలేదు. 

దీనికిగాను మయోసైటిస్ అని వ్యాధితో బాధపడుతుంది సమంత. ఇప్పుడిప్పుడే ఆ వ్యాధి నుండి బయటపడుతుంది. తాజాగా ముంబైలోని ఒక స్టూడియోలో కనిపించింది సమంత. త్వరలోనే విజయ్ దేవరకొండ తో నటిస్తున్న సినిమాకి సంబంధించిన షూటింగ్లో కూడా సమంత పాల్గొనే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే చాలామంది వీరి అభిమానులు సమంతా నాగచైతన్యతో విడాకులు తీసుకొని ఇంత సమయం గడుస్తున్నప్పటికీ తన చేతి మీద ఉన్న టాటూను మాత్రం ఇంకా తొలగించలేదు. సమంత నాగచైతన్యని ఇంకా మరిచిపోలేదు అనడానికి ఇదే ప్రత్యక్ష సాక్ష్యం అని చాలామంది భావిస్తున్నారు.

ఇదివరకు లాగా సమంత యాక్టివ్గా కనిపించడం లేదు. దీంతోపాటు చేతికి ఉన్న ఆ డేటు కూడా సమంత ఇంకా తొలగించకపోవడంతో ఈ వార్తలు వస్తున్నాయి. చాలామంది వీరి అభిమానులు నాగచైతన్య కి సమంత మానసికంగా దూరం కాలేక పోతుంది అని కూడా అంటున్నారు. ప్రస్తుతం సమంత వ్యాధి నుండి కొలుకోవడంతో అటు కోలీవుడ్ టాలీవుడ్ మరియు బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలో చేస్తూ బిజీగా ఉంది. దీంతో చాలామంది వీరి అభిమానులు విడాకులై ఇన్నాళ్లయినప్పటికీ మళ్లీ వీరిద్దరూ  కలిస్తే బాగుంటుంది అని అభిప్రాయపడుతున్నారు.వీరిద్దరూ విడాకులు తీసుకుని ఇన్నాళ్లు అయినప్పటికీ ఎవరూ కూడా ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: