తెలుగు సినిమా ఇండస్ట్రీలో పేపర్ బాయ్ మూవీ తో మంచి గుర్తింపును సంపాదించుకున్న సంతోష్ శోభన్ ప్రస్తుతం వరుస మూవీ లతో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. కొంతకాలం క్రితం ఈ యువ హీరో ఏక్ మినీ కథ మూవీ తో ఇటు ప్రేక్షకుల నుండి ... అటు విమర్శకుల నుండి మంచి ప్రశంసలను అందుకున్నాడు. ఈ మూవీ థియేటర్ లలో కాకుండా నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో విడుదల అయ్యి మంచి ప్రేక్షకాదరణ పొందింది.

ఇది ఇలా ఉంటే ఆఖరుగా సంతోష్ శోభన్ ... మెర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందిన లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ లో హీరోగా నటించాడు. ఫరియ అబ్దుల్లా ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏ మాత్రం అలరించలేక పోయింది. ఇలా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ తో ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయిన సంతోష్ శోభన్ తాజాగా యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందిన కళ్యాణం కమనీయం అనే మూవీ లో హీరోగా నటించాడు. 

అనిల్ కుమార్ అల్లా దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ లో ప్రియ భవాని శంకర్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ద్వారా ఈ ముద్దుగుమ్మ తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ మూవీ ని జనవరి 14 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ సినిమా యూనిట్ ఈ మూవీ కి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసింది. ఈ మూవీ కి సెన్సార్ బోర్డ్ నుండి క్లీన్ "యు" సర్టిఫికెట్ లభించింది. ఈ మూవీ తో సంతోష్ ఓపెన్ ఏ రేంజ్, విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటాడో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: