తాజాగా ఇండియన్ సినిమా ఆర్ఆర్ఆర్ వరుసగా సత్తా చాటుతూ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోందని చెప్పడంలో సందేహం లేదు. ఈ క్రమంలోనే రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన విషయం తెలిసిందే. ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకుంది. ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు సాంగ్ అవార్డును గెలుచుకోవడం గమనార్హం. ఇకపోతే ఈ పాటలో ఎన్టీఆర్ , రామ్ చరణ్ వేసిన స్టెప్పులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

2023 గోల్డెన్ గ్లోబ్ అవార్డుల కార్యక్రమం కాలిఫోర్నియాలో ఇటీవల జరుగుతోంది.. ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ మూవీ రెండు నామినేషన్లలో ఈ అవార్డులను దక్కించుకోవడం గమనార్హం. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అలాగే బెస్ట్ మూవీ క్యాటగిరీలో ఈ మూవీ నామినేట్ కాగా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అవార్డును తాజాగా కైవసం చేసుకుంది. ముఖ్యంగా ఈ అవార్డును ఎంఎం కీరవాణి అందుకున్నారు. ఇకపోతే ఒక ఇండియన్ సినిమాకు తొలిసారిగా ఈ అవార్డు లభించడం నిజంగా విశేషం అనే చెప్పాలి.


ఆర్ ఆర్ ఆర్ మూవీలో నాటు నాటు పాటను ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి స్వరపరిచారు.  ఈ పాటను కాలభైరవ , రాహుల్ సిప్లిగంజ్ ఆలపించడం జరిగింది.ఇకపోతే గోల్డెన్ గ్లోబ్ అవార్డు.. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కింద నాటు నాటు పాట దక్కించుకోవడంతో స్టేజి పైన ఎం ఎం కీరవాణి గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకోగా.. స్టేజి కింద రాజమౌళి,  ఎన్టీఆర్ , రామ్ చరణ్,  రమా రాజమౌళి అందరూ కూడా చప్పట్లతో హుషారెత్తించారు. మొత్తానికి అయితే అందుకు సంబంధించిన ఈ చిన్న క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతుంది.  అంతేకాదు పలువురు అభిమానులు , సెలబ్రిటీలు కూడా ఆర్ఆర్ఆర్ టీంకు అభినందనలు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: