తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి గోపీచంద్ మలినేని గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ దర్శకుడు రవితేజ హీరోగా రూపొందిన డాన్ శీను మూవీతో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలు పెట్టాడు  ఆ తర్వాత బలుపు ... క్రాక్ వంటి పలు విజయవంతమైన సినిమాలకు దర్శకత్వం వహించి తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు గల దర్శకుడుగా పేరు తెచ్చుకున్నాడు.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ దర్శకుడు నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా శృతి హాసన్ , హనీ రోజ్ హీరోయిన్ లుగా రూపొందిన వీర సింహా రెడ్డి అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో వరలక్ష్మి శరత్ కుమార్ , దునియా విజయ్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలో నటించగా , తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. మైత్రి సంస్థ వారు ఈ మూవీ ని నిర్మించారు. ఈ సినిమాను ఈ సంవత్సరం జనవరి 12 వ తేదీన థియేటర్ లలో విడుదల చేశారు. ప్రస్తుతం ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ కలెక్షన్లు లభిస్తున్నాయి.

ఇది ఇలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న గోపీచంద్ మలినేని కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు. తాజా ఇంటర్వ్యూలో భాగంగా గోపీచంద్ మలినేని మాట్లాడుతూ ... నిజానికి నేను బాలకృష్ణ గారికి మొదట వేరే కథను చెప్పాను. అది ఒక రోజులో జరిగే సంఘటన ఆధారంగా రూపొందించబడింది. అఖండ మూవీ తర్వాత ప్రేక్షకులు తన నుండి మరింతగా ఆశిస్తున్నారు అని బాలయ్య చెప్పారు. అప్పుడు నేను నా పాత కథల్లో ఒకదాని డెవలప్ చేసి వీర సింహా రెడ్డి మూవీ ని చేశాను అని గోపీచంద్ మలినేని తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: