ఇటీవల కాలంలో ఇండస్ట్రీలో హీరోయిన్లుగా కొనసాగుతున్న వారు కేవలం నటనకు మాత్రమే పరిమితం అవుతున్నారు. కానీ ఒకప్పుడు మాత్రం ఇలా హీరోయిన్లుగా కొనసాగుతున్న వారు దర్శకులుగా తమ ప్రతిభను  నిరూపించుకోవడం.. ఇక సంగీత దర్శకులుగా ఎన్నో సినిమాలకు పాటలను అందించడం లాంటివి చేసి.. ఇక ఎన్నో రంగాల్లో సక్సెస్ అయ్యారు.  మరి కొంతమంది నిర్మాతలుగా కూడా మారి తమ హవా నడిపించారు అని చెప్పాలి. ఇక ఇలా తాను అడుగుపెట్టిన ప్రతి రంగంలో కూడా సూపర్ సక్సెస్ అయిన హీరోయిన్ భానుమతి.


 అప్పటికే హీరోయిన్గా విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను పలకరించిన భానుమతి.. ఇక తన నటనతో విమర్శకులను సైతం మెప్పించి ప్రశంసలు అందుకుంది. కేవలం నటనతోనే ఆగిపోకుండా సంగీత దర్శకురాలిగా కూడా మారిపోయింది. ఇక గాయనిగా డైరెక్టర్గా రచయిత్రిగా హీరోయిన్గా ఇలా ఎన్నో రంగాల్లో విజయం సాధించిన మహిళగా కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో భానుమతికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు అని చెప్పాలి. అయితే భానుమతి కృష్ణ ప్రేమ సినిమాలో నటిస్తున్న సమయంలో పాలువాయి రామకృష్ణ ఆ సినిమాకి సహాయ దర్శకుడిగా ఉన్నారట. రాముడు మంచి బాలుడు అనే రామకృష్ణ ప్రవర్తన ఉండేదట. దీంతో భానుమతి చూపును అతను ఆకర్షించాడు. వీరిద్దరి మధ్య అప్పట్లో ఉన్న మూగ ప్రేమను ఇక సెట్ లో ఉన్న వారందరూ అర్థం చేసుకునే వారట.


 ఇక ఈ విషయం ఆ నోట ఈ నోట పడి ఇండస్ట్రీ మొత్తం పాకిపోయింది. చివరికి భానుమతి తండ్రి వెంకటసుబ్బయ్యకు కూడా తెలిసిందట. కానీ ఆయన మాత్రం భానుమతి రామకృష్ణ పెళ్లికి ఒప్పుకోలేదట. దీంతో రామకృష్ణ మీద ఉన్న ప్రేమతో భానుమతి దాదాపు మూడు రోజులపాటు అన్నం తినకుండానే గదిలో కూర్చుని ఏడుస్తూ ఉందట. ఇక ఆ సమయంలో భానుమతి తండ్రి అప్పుడు స్టార్ కంబైన్స్ అధినేతగా ఉన్న రామయ్య తో ఈ వ్యవహారాన్ని చెప్పారట. చివరికి రామయ్య కల్పించుకుని ఇక భానుమతి రామకృష్ణను పిలిపించి పెద్దలతో మాట్లాడి ఇద్దరికీ పెళ్లి చేశారట.

మరింత సమాచారం తెలుసుకోండి: