మోస్ట్ బ్యూటిఫుల్ శ్రీలంకన్ బ్యూటీ జాక్వలిన్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో బాలీవుడ్ మూవీ లలో నటించి ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న జాక్వలిన్ , రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో రూపొందిన సాహో మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ లో నటించి ఎంతో మంది తెలుగు సినీ ప్రేమికుల మనసు కూడా దోచుకుంది. 

ఇలా ఉంటే కొంత కాలం క్రితమే ఈ హాట్ బ్యూటీ కిచ్చా సుదీప్ హీరోగా రూపొందిన విక్రాంత్ రొనా అనే కన్నడ మూవీ లో కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటించి తన అంద చందాలతో ... డ్యాన్స్ తో ప్రేక్షకులను అలరించింది. ఇలా బాలీవుడ్ తో పాటు సౌత్ సినిమాల్లో కూడా నటిస్తూ ఎంతో మంది ప్రేక్షకులను అలరిస్తున్న ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే ఎన్నో సినిమాలలో తన అందచందాలను ఆరబోసి ఎంతో మంది కుర్ర కారు అభిమానుల మనసు కూడా దోచుకుంది. ఇది ఇలా ఉంటే సినిమాల్లో తన అందచందాలను ఆరబోయడానికి ఏ మాత్రం వెనకడుగు వేయని జాక్వలిన్ తన సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో తన అంద చందాలు ప్రదర్శితం అయ్యేలా ఉండే ఫోటోలను పోస్ట్ చేస్తూ కుర్రకారును హీట్ ఎక్కిస్తూ వస్తుంది.
తాజాగా జాక్వలిన్ తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఆ ఫోటోలలో ఈ ముద్దు గుమ్మ అదిరిపోయే లుక్ లో ఉన్న శారీని కట్టుకొని ... డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్న  బ్లౌజ్ ను ధరించి అదిరిపోయే యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఈ ఫోటోలను జాక్వలిన్ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా అవి ప్రస్తుతం సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: