తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ సీనియర్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్న విక్టరీ వెంకటేష్ తాజాగా సైన్ధవ్ అనే మూవీ లో హీరోగా నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే.

మూవీ కి టాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తూ ఉండగా , ఈ మూవీ ని నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందిస్తున్నారు. ఈ సినిమా వెంకటేష్ కెరియర్ లో 75 వ మూవీ గా రూపొందబోతుంది. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా బృందం ఈ మూవీ నుండి ఒక వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోకు ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. అలాగే ఈ మూవీ ని తెలుగు తో పాటు తమిళ్ , హిందీ , కన్నడ , మలయాళ భాషల్లో పాన్ ఇండియా మూవీ గా విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. 

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన మరో అద్భుతమైన అప్డేట్ ను ప్రకటించింది. ఈ మూవీ లో బాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటులలో ఒకరు అయినటువంటి నవాజుద్దీన్ సిద్ధికి నటించబోతున్నట్లు ఈ చిత్ర బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ చిత్ర బృందం విడుదల చేసిన ఈ పోస్టర్ లో దర్శకుడు శైలేష్ కొలను మరియు నవాజుద్దీన్ సిద్ధిఖీ లు ఉన్నారుm ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: