కొరటాల శివ కు ఎన్టీఆర్ పై ఎంతో అభిమానం వుంది.ఈ దర్శకుడు మరోసారి ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి సిద్ధం అయ్యాడు.ఈ సినిమాతో తనేంటో ప్రూవ్ చేసుకుంటానని గట్టి నమ్మకాన్ని అయితే కలిగి ఉన్నారు. కొరటాల శివసినిమా కోసం భారీ సముద్రాన్ని రీ క్రియేట్ చేయనున్నారని సమాచారం.

ఈ సినిమాలో అదిరిపోయే సెట్స్ ఉంటాయని సమాచారం.ఈ సినిమా కోసం అస్సలు ఎవరూ ఊహించని సెట్స్ వేయనున్నారనే వార్త కూడా ఫ్యాన్స్ కు ఒకవైపు సంతోషాన్ని కలిగిస్తుండగా మరోవైపు ఆశ్చర్యానికి అయితే గురి చేస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ దాదాపు ఖరారు అయినా కానీ రెమ్యునరేషన్ మరియు ఇతర కారణాల వల్ల ఆ విషయాలను వెల్లడించడాని కి మేకర్స్ ఇష్టపడటం లేదని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.

ఎన్టీఆర్,కొరటాల శివ కాంబో మూవీ కోసం సాబు సిరిల్ కూడా పని చేస్తున్నారనీ తెలుస్తుంది.. వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాను తెరకెక్కించనుండగా సముద్రంలో మెజారిటీ సన్నివేశాలనూ తీయాలనీ దాని కోసం ప్రత్యేక సెట్ వేసి గ్రాఫిక్స్ లో సముద్రాన్ని చూపించనున్నారని సమాచారం కూడా అందుతోంది. ఫిబ్రవరి ఫస్ట్ వీక్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలుకానుందని సమాచారం.. సముద్రం,పోర్ట్ వాతావరణం ఉండేలా ఈ సెట్ ఉంటుందని సమాచారం.

సినిమా పూజా కార్యక్రమాని కి మెగా ఫ్యామిలీకి చెందిన పలువురు హీరోలు హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం.RRR విజయంతో మెగా హీరోలతో ఎన్టీఆర్ కు అనుబంధం బాగా పెరిగింది. కొరటాల శివ ఈ సినిమాతో విజయం సాధిస్తేనే ఆయనకు సినిమా ఆఫర్లు అంతకంతకూ పెరిగే అవకాశం కూడా ఉంటుంది. గ జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీ ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్ అయ్యే కాన్సెప్ట్ తో తెరకెక్కుతోందని సమాచారం అందుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: