ఎన్నో వైవిధ్యమైన సినిమాలు ఇంకా అలాగే ఎన్నో విలక్షణమైన పాత్రల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నందమూరి కళ్యాణ్ రామ్.ఇటీవలే  బింబిసార సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.ఇప్పుడు ఆయన మూడు పాత్రల్లో నటించిన లేటేస్ట్ మూవీ 'అమిగోస్'. రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 10 వ తేదీన చాలా గ్రాండ్ లెవల్లో రిలీజ్ కానుంది.ఈ క్రమంలోనే అమిగోస్ ప్రమోషనల్ యాక్టివిటీస్ కూడా చాలా జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన 'అమిగోస్' మూవీ టీజర్‌ ఇంకా అలాగే సాంగ్‌కు జనాల నుంచి చాలా సూపర్బ్ రెస్పాన్స్ వచ్చాయి. ఇక మంగళవారం నాడు విడుదలైన ఎన్నో రాత్రులొస్తాయి గానీ పాటకు అయితే ఇప్పుడు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసారు హీరో కళ్యాణ్ రామ్.


ఇక ఈ సినిమా ట్రైలర్ ను ఫిబ్రవరి 3 వ తేదీ న విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు హీరో కళ్యాణ్ రామ్. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఒక మాంచి మాస్ లుక్ పోస్టర్ ట్వీట్ చేశారు. ఈ మూవీ ద్వారా ఖచ్చితంగా మీరు సరికొత్త థ్రిల్ పొందుతారంటూ పోస్ట్ చేశారు. ఫిబ్రవరి 10 వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కాబోతుంది ఈ కన్నడ బ్యూటీ.ఇక మంగళవారం నాడు విడుదలైన సెకండ్ సాంగ్‌ కు కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ధర్మ క్షేత్రం మూవీలో ఎవర్ గ్రీన్ మెలోడి సాంగ్ ' అయిన ఎన్నో రాత్రులొస్తాయిగానీ..' సాంగ్‌కి ఇది రీమిక్స్ పాట. ధర్మ క్షేత్రంలోని ఎన్నో రాత్రులొస్తాయిగానీ.. పాటను ఎస్‌.పి.బాలసుబ్రమణ్యం గారు పాడారు. ఇక ఇప్పుడు అదే పాటకు రీమిక్స్ సాంగ్‌ను కూడా ఆయన తనయుడు ఎస్‌.పి.బి.చరణ్ పాడటం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: