తమిళ సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోలలో ఒకరు అయినటువంటి తలపతి విజయ్ కొన్ని రోజుల క్రితమే వారిసు అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాని తెలుగు లో వారసుడు అనే పేరుతో విడుదల చేశారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ లో రష్మిక మందన హీరోయిన్ గా నటించగా దిల్ రాజు ఈ మూవీ ని నిర్మించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది.

ఇలా వారసు మూవీ తో మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న విజయ్ ప్రస్తుతం లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో త్రిష , విజయ్ సరసన హీరోయిన్ గా నటించనుండగా అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతం అందించనున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ యూనిట్ ఇప్పటివరకు ఈ సినిమాకు టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. దానితో ఈ సినిమా విజయ్ కెరియర్ లో 67 వ మూవీ గా రూపొందుతున్న నేపథ్యంలో ఈ మూవీ యూనిట్ ఈ సినిమాను తలపతి 67 అనే వర్కింగ్ టైటిల్ తో చిత్రీకరణ జరుపుతుంది. 

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా టైటిల్ ను ఈ రోజు సాయంత్రం 5 గంటలకు అనౌన్స్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ చిత్ర బృందం విడుదల చేసిన పోస్టర్ చాలా డిఫరెంట్ గా ఉండడంతో పాటు ప్రేక్షకులకు ఆసక్తిని కూడా రేకెస్తోంది. ఇది ఇలా ఉంటే వారిసు మూవీ తర్వాత విజయ్ నటిస్తున్న మూవీ కావడం ... విక్రమ్ మూవీ తర్వాత లోకేష్ కనకరాజు దర్శకత్వం వహించిన సినిమా కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: