టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది రకుల్ ప్రీత్ సింగ్. ప్రస్తుతం టాలీవుడ్ మరియు బాలీవుడ్ లో వరుస సినిమాలో చేస్తూ దూసుకుపోతుంది.అయితే తాజాగా తనకి సంబంధించిన కొన్ని విషయాలను సోషల్ మీడియా ద్వారా  పంచుకుంది రకుల్ ప్రీత్ సింగ్. ఇందులో భాగంగానే తను మాట్లాడుతూ.. ఒకవేళ షూటింగ్ లేకపోతే కాల్ టైంలో తన స్నేహితులతో గడుపుతానని ..అంతేకాదు తన ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి ఉండడం తనకి చాలా ఇష్టమని.. ఖాళీగా ఉంటే గల్ఫ్ ఆడతానని.. ఇష్టమైన సినిమాలు చూస్తానని.. 

కానీ ఎక్కువ రోజులు మాత్రం అసలు ఖాళీగా ఉండలేను అని.. నేను వర్క్ హాలిక్ అని చెప్పుకొచ్చింది ఈమె.ఈ క్రమంలోనే తనం పెళ్లి గురించి మాట్లాడుతూ.. పెళ్లి చేసుకునే ఉద్దేశం ఇప్పట్లో లేదని.. నా పెళ్లికి సంబంధించి రకరకాల రూమర్స్ వస్తున్నాయని.. వచ్చినా నేను పెద్దగా ఫీల్ అవ్వను అని చెప్పుకొచ్చింది. అంతే కాదు ప్రస్తుతం నా చేతినిండా సినిమాలు ఉన్నాయని.. ఆ సినిమాలన్నీ అయిపోయిన తర్వాత వేరే విషయాల గురించి ఆలోచిస్తానని.. ప్రస్తుతం వాటన్నింటి గురించి ఆలోచించే సమయం నాకు లేదు అని చెప్పకు వచ్చింది. అంతేకాకుండా సినిమాల్లో అప్పటికి ఇప్పటికీ పురుషులదే ఆధిపత్యం నడుస్తోంది అని.. మనం ఉన్నది కూడా పురుషాదిక్య సమాజంలో..

అయినంత మాత్రాన నేను దీనికి భయపడను అని ఓటమిని అంగీకరించి ఎప్పుడూ వెనకడుగు వేయొద్దు అని.. తన తల్లిదండ్రులు కూడా తనని ఇలాంటి వివక్ష లేకుండా తనని పెంచాలని.. చెప్పకు వచ్చింది. అంతేకాదు జీవితంలో సక్సెస్ ఫెయిల్యూర్స్ వస్తూనే ఉంటాయని.. వాటిని తలుచుకుంటూ కుంగిపోవడం మంచిది కాదు అని..ప్రస్తుతం తన ఫోకస్ అంతా కూడా రాబోయే సినిమాలపైనే ఉంది అని..అంతేకాదు తన దగ్గరికి వచ్చిన ప్రతి స్క్రిప్ట్ ని చాలా బాగా జాగ్రత్తగా చదువుతాను అని.. ఒకసారి నిర్ణయం తీసుకున్నాక అస్సలు వెనకడుగు వేయను అని.. చెప్పుకొచ్చింది. అంతేకాకుండా సంపాదన కోసం సినిమాల్లోకి రావద్దు అని..కష్టపడే మనస్తత్వం ఉండి ఇండస్ట్రీలోకి రావాలని.. చెప్పుకొచ్చింది.మాది సైనిక కుటుంబం కాబట్టి సహజంగా నేను దేనికి భయపడను అని.. ముఖ్యంగా సవాళ్లను ఇష్టపడతాను అని చెప్పుకొచ్చింది రకుల్ ప్రీత్ సింగ్..!!

మరింత సమాచారం తెలుసుకోండి: