తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయి న్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది తమన్న. ఎన్నో సినిమాలను నటించి ప్రస్తుతం స్టార్ హీరోయిన్గా వెలుగుతుంది. అయితే గతంలో వరస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఈ అమ్మడు ప్రస్తుతం అడపాదడపా సినిమాల్లో నటిస్తూ పెద్దగా కనిపించడం లేదు.  గోవాలో జరిగిన న్యూ ఇయర్ వేడుకల్లో తమన్నా మరొక నటుడు విజయవర్మతో ఉన్న ఒక వీడియో బయటకి రావడంతో ఒక్కసారిగా ఆమె అభిమానులు షాక్ అయ్యారు. దాని తర్వాత ఈ జంట రెండు సార్లు కనబడ్డారు. దీంతో వీరిద్దరి మధ్య ఏదో ఉంది అని అందరూ భావించారు.

తాజాగా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా విజయవర్మ ఒక పోస్టుని ఆయన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు. ఇక ఈ పోస్ట్ లో భాగంగా తమన్నతో ఆయనకున్న రిలేషన్షిప్ గురించి అధికారికంగా ప్రకటిస్తారు అని అందరూ వెయిట్ చేశారు. కానీ అందరూ భావించినట్టు అలా జరగలేదు. కేవలం ఇన్స్టాగ్రామ్ లో ఒక పిక్ ను షేర్ చేసి ఫేస్ కనపడకుండా జాగ్రత్త తీసుకున్నారు ఈ జంట .అయితే ఆ ఫోటోలో ఉన్నది తమన్నా కదా అన్నది మాత్రం ఎవరు తేల్చలేకపోతున్నారు. ఇక అసలు విషయం ఏంటంటే విజయ్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో భాగంగా రెడ్ హాట్ ఇమేజిని పెట్టి ఒక ఫోటోని షేర్ చేశాడు. ఇక ఈ ఫోటోలో రెండు జతల పాదాలు కనిపిస్తాయి.

ఒకదానితో ఒకటి ఎదురుగా ఉండేలా ఆ ఫోటో మనం చూడొచ్చు. కానీ ఆ ఫోటోలో ముఖాలు మాత్రం ఎక్కడా కూడా కనబడవు ఈ ఫోటోలో ఒక జత పాదాల  విజయ్ వర్మ వి .. అయితే మరొక పాదాలు ఎవరివో మాత్రం క్లారిటీగా తెలియదు. ఈ నేపథ్యంలోనే ఆ మరొక జత పాదాలు తమన్న వే అని అంటున్నారు నటిజన్స్.ఎందుకు అంటే ఆ ఫోటోలో తమన్నా పాదాలతో పాటు జాకెట్ కూడా కనిపిస్తుంది. అయినప్పటికీ ఆ పాదాలు తమన్నవే అని చెప్పలేం. ఎందుకంటే ఆ జాకెట్ తమన్నదా  కాదా అన్నది కూడా తెలియదు. ఈ నేపథ్యంలోనే ఈ ఫోటో చూసిన వారందరూ ఆ పాదాలు కచ్చితంగా తమన్నవే అంటూ అంటున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: