సౌత్ స్టార్ డైరెక్టర్ అట్లీ దళపతి విజయ్ తో వరుస సూపర్ హిట్ సినిమాలు తీసి పాన్ ఇండియా డైరెక్టర్ గా మారాడు. ప్రస్తుతం బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తో జవాన్ సినిమా చేస్తున్నాడు అట్లీ. కొన్నాళ్లుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఈ ఇయర్ సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. రీసెంట్ గా పఠాన్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న షారుఖ్ ఖాన్ ఎన్నో ఏళ్లుగా సరైన సక్సెస్ లేక డీలా పడ్డాడు. ఫైనల్ గా పఠాన్ షారుఖ్ ని మళ్లీ హిట్ ట్రాక్ లోకి తీసుకొచ్చింది. ఇక అట్లీ జవాన్ కూడా మరో హిట్ టార్గెట్ తో వస్తుంది. ఈ సినిమాలో కెమియో రోల్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తాడని టాక్.

షారుఖ్ సినిమాలో బన్నీ అంటే అది మంచి ఛాన్స్ అని చెప్పొచ్చు. అల్లు అర్జున్ కూడా ఆఫర్ ని ఓకే చేసినట్టు టాక్. అయితే అది చేసినా చేయకపోయినా అట్లీ నెక్స్ట్ సినిమా టార్గెట్ మాత్రం అల్లు అర్జున్ అని తెలుస్తుంది. ఇప్పటికే తెలుగులో ఎన్.టి.ఆర్, అల్లు అర్జున్ లతో సినిమా చేయాలని ఉందని తన మనసులోని ఆలోచన అంతకుముందే బయట పెట్టిన అట్లీ జవాన్ తర్వాత అల్లు అర్జున్ తో సినిమా ఫిక్స్ చేసుకుంటాడని తెలుస్తుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తి కాగానే అట్లీ కథ నచ్చితే కచ్చితంగా ఓకే చేసే ఛాన్స్ ఉంది.

అట్లీతో అల్లు అర్జున్ సినిమా ఫిక్స్ అయితే మాత్రం ఆ మూవీ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని చెప్పొచ్చు. మరోపక్క అల్లు అర్జున్ బాలీవుడ్ డైరెక్టర్స్ తో కూడా చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి పుష్ప తో వచ్చిన క్రేజ్ ని తన నెక్స్ట్ సినిమాలన్నీ పాన్ ఇండియా రిలీజ్ చేసేలా బన్నీ మెగా ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. షారుఖ్ జవాన్ హిట్ పడితే అట్లీతో అల్లు అర్జున్ సినిమాకు లైన్ క్లియర్ అయినట్టే లెక్క.


మరింత సమాచారం తెలుసుకోండి: