మెగా బ్రదర్ నాగబాబు మెగా హీరోల లాగా హీరోగా సక్సెస్ కాలేకపోయారు. నిర్మాతగా అయినా సక్సెస్ అవుతాడని అందరూ భావించారు కానీ అక్కడ కూడా పెద్దగా సక్సెస్ కాలేకపోయాడు మెగా బ్రదర్ నాగబాబు. ప్రస్తుతం నాగబాబు జనసేన పార్టీ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. తాజాగా మెగా హీరోలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. తన కుటుంబంలో ఎంతోమంది స్టార్ హీరోలు ఉన్నా కూడా తనకు ఎప్పుడూ క్యారెక్టర్ ఆఫర్ చేయలేదు అంటూ మెగా హీరోలపై సంచలన వ్యాఖ్యలను చేశారు మెగా బ్రదర్ నాగబాబు. 

తాజాగా శ్రీదేవి శోభన్ బాబు సినిమాలో నటించాడు మెగా బ్రదర్ నాగబాబు .ఇక ఈ సినిమా ఈనెల 18వ తేదీన విడుదల కానుంది .అయితే ఈ క్రమంలోనే బుధవారం ఈ సినిమాకి సంబంధించిన నిర్వహించారు చిత్ర బృందం .ఈ సినిమాకి మెగా డాటర్ కొణిదల సుస్మిత ఆమె భర్త సహనిర్మాతులుగా వ్యవహరించడం జరిగింది .సంతోష్ శోభన్ గౌరీ జి కిషన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ తండ్రి పాత్ర పోషించాడు మెగా బ్రదర్ నాగబాబు.ఈ  ఈవెంట్ లో భాగంగా నాగబాబు మెగా హీరోలకి సంబంధించిన ఆసక్తికరమైన వ్యాఖ్యలను చేశాడు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుస్మిత పై ప్రశంసల వర్షం కురిపించడం జరిగింది. అంతేకాదు తన ఇంట్లో ఎంతో మంది స్టార్ హీరోలు ఉన్నా సరే సుస్మిత వాళ్ళ సహాయం తీసుకోకుండా సొంతంగా ఎదిగింది అని ఈ విషయంపై మరిన్ని విషయాలు మాట్లాడుతూ.. మా ఇంట్లో చాలామంది స్టార్ హీరోలు ఉన్నారు .అయినా సరే వాళ్ళు ఎప్పుడూ కూడా నన్ను ఏ క్యారెక్టర్ కోసం అడగలేదు. కానీ మొదటిసారి సుస్మిత నాకు సినిమాలో అవకాశం ఇచ్చింది. ఇదే మొదటి అవకాశం కాదు. రెండవ అవకాశం .ఇంకో వెబ్ సిరీస్ లో కూడా హనీ నాకు అవకాశం ఇచ్చింది అంటూ తన కూతురిపై ప్రశంసల వర్షం కురిపించాడు మెగా బ్రదర్ నాగబాబు .దీంతో నాగబాబు చేసిన వ్యాఖ్యలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: