ప్రముఖ నందమూరి హీరో తారకరత్న గడిచిన కొద్దిరోజులుగా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే .గుండెపోటు కారణంగా ఆరోగ్యం పాడై బెంగళూరులోని నారాయణ హృదయాలయాలు చికిత్స పొందడం జరుగుతోంది. దాదాపుగా 23 రోజులు అక్కడే ఉండి వైద్యం తీసుకుంటున్నారు. కార్డియాక్ అరెస్టు తీవ్రత కారణంగా తారకరత్న శరీరంలో పలువైయాలు కూడా పనిచేయకుండా పోయినట్లు వైద్యులు తెలియజేశారు.


మెదడు సైతం తీవ్రంగా దెబ్బతినడంతో.. చికిత్స కోసం విదేశీ వైద్యుల బృందం రంగంలోకి దిగారు. అయితే ఆయనకు ప్రత్యేకమైన వైద్యం అందిస్తున్నట్టుగా వార్తలు వినిపించాయి  ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తోంది వైద్య బృందం. అయితే శనివారం ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని అత్యంత విషయంగా మారిందని వార్తలు కూడా వినిపించాయి నేపథ్యంలోని ఆయన మరణించినట్లుగా కూడా తెలుస్తోంది. చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచినట్లుగా తెలుస్తోంది తారకరత్న. 23 రోజుల క్రితం నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్రలో తారకరత్న పాల్గొన్నారు. తన బావమరిది యాత్రకు తన మద్దతు తెలియజేయడంతో పాటు పాదయాత్రలో కొన్ని వేలమంది టిడిపి కార్యకర్తలు నడుస్తూ ఉన్నారు.


ఈ నేపథ్యంలో తారకరత్న ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో అక్కడే ఉన్న ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.ప్రధమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఈఎస్ఐ ఆసుపత్రికి తరలించారు అక్కడ వైద్యులు అత్యవసర విభాగంలో ఆయనని రాత్రి వరకు చికిత్స అందించారు. రాత్రి అక్కడ నుంచి బెంగళూరు ఆసుపత్రికి తరలించాక 23 రోజులు అక్కడే చికిత్స అందిస్తున్నారు. కానీ ఈ రోజున పరిస్థితి విషయమించడంతో విశ్వాస విడిచారు. ఇక తారకరత్న ఎన్టీఆర్ వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి మొదట ఒకటో నెంబర్ కుర్రాడు సినిమా ద్వారా వెంటనే ఇచ్చారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక 2002లో తన కెరియర్ ప్రారంభించిన తారకరత్న దాదాపుగా 23 సినిమాలలో నటించారు పలు చిత్రాలను విలన్ గా కూడా నటించారు. తారక రత్న భార్య విజయసాయిరెడ్డి భార్య చెల్లెలు కూతురు.

మరింత సమాచారం తెలుసుకోండి: