ఏడాదంతా చదివిన పిల్లలు ఎలా అయితే సమ్మర్ హాలిడేస్ తీసుకుంటారో అటు సిని సెలెబ్రిటీలు కూడా ఇలాంటి హాలిడేస్ తీసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అని చెప్పాలి. వరుస సినిమా షూటింగ్ లతో బిజీ బిజీగా ఉండే హీరో హీరోయిన్లు ఇక ఏదైనా సినిమా షూటింగ్ కంప్లీట్ అయిందంటే చాలు కాస్త గ్యాప్ తీసుకుని కొన్ని రోజులు సెలవు తీసుకుని ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలని భావిస్తూ ఉంటారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే కొన్ని పర్యాటక ప్రాంతాలకు వెళ్లి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడం లాంటివి ఇప్పటివరకు చాలానే చూశాం.


 ఇక ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఇదే చేయబోతున్నాడట. రామ్ చరణ్ కు అనుకోకుండా నెల రోజులు సెలవులు వచ్చాయట. ఇక ఈ నెల రోజుల హాలిడేని రామ్ చరణ్ ఎలా గడపబోతున్నాడు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి. ఇంతకీ చరణ్ కి నెల రోజులు సెలవులు ఎలా వచ్చాయంటే.. గత కొన్ని రోజుల నుంచి రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఆర్సీ 15 సినిమా షూటింగ్ శరవేగంగా జరిగింది. అయితే ఒకే సమయంలో శంకర్ కమల్ హాసన్ భారతీయుడు 2 సినిమా షూటింగ్ కూడా చేస్తూ ఉన్నారు.


 అయితే ప్రస్తుతం భారతీయుడు 2 సినిమాలోని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించాల్సి ఉందట. దీనికోసం చెన్నైలోనే ఉండబోతున్నాడు శంకర్. ఈ క్రమంలోనే ఆర్సి15 సినిమా షూటింగ్ కి కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చాడట శంకర్. ఈ క్రమంలోనే ఇక చరణ్ కు దాదాపు నెలరోజుల పాటు రెస్ట్ తీసుకునే అవకాశం లభించిందట. అయితే ఈ సెలవులలో ఎక్కడికి వెళ్తాడు అన్నది హాట్ టాపిక్  గా మారింది. అయితే ఉపాసన గర్భవతి కావడంతో ఇక విదేశాలకు వెళ్లే ఛాన్స్ లేదు. అదే సమయంలో ఇక షూటింగ్స్ బిజీ కారణంగా గత కొన్ని రోజుల నుంచి భార్య ఉపాసనతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేసింది కూడా లేదు. దీంతో ఈ నెల రోజుల పాటు భార్యను దగ్గరుండి చూసుకొని ఇక ఫ్యామిలీతోనే గడపబోతున్నాడట రామ్ చరణ్. అదే సమయంలో ఇక ఆస్కార్ వేడుకలకు హాజరు కావలసిన నేపథ్యంలో ఇక ఫారిన్ వెళ్లే ఛాన్స్ కూడా ఉందట.

మరింత సమాచారం తెలుసుకోండి: