దర్శకతీరుడు రాజమౌళికి ఇక ఇప్పుడు కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాదు.. ఇండియా మొత్తం.. కాదు కాదు ప్రపంచ సినీ ఇండస్ట్రీలో కూడా ఎంతగానో గుర్తింపు వచ్చింది. ఆయన తీసిన సినిమాలు ప్రస్తుతం ప్రపంచ వేదికలపై సత్తా చాటుతూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఇక బాహుబలి తర్వాత ఒక్కసారిగా అటు రాజమౌళి క్రేజ్ మారిపోయింది. ఆయన దర్శకత్వంలో ప్రేక్షకులు ముందుకు వస్తున్న సినిమాలు అయితే ఎన్నో రికార్డులు కొల్లగొడుతున్నాయ్ అని చెప్పాలి. దీంతో ఇటీవల కాలంలో ఇక దర్శక ధీరుడు రాజమౌళికి సాధ్యంకానీ రికార్డు ఏది లేదు అని సినీ పండితులు కూడా చెబుతూ ఉంటారు.


 కానీ ఇప్పటికే తన సినిమాలతో పాన్ ఇండియా రేంజ్ లో రికార్డులను కొల్లగొట్టిన రాజమౌళికి ఇక టాలీవుడ్కు మాత్రమే పరిమితమైన బోయపాటి శ్రీను సాధించిన ఒక రికార్డు మాత్రం బద్దలు కొట్టడం ఇప్పటికీ సాధ్యం కాలేదట. బి.గోపాల్, వివి వినాయక్ ల తర్వాత ఆ రేంజ్ లో మాస్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్నాడు బోయపాటి శ్రీను. దాదాపు అందరూ బడా హీరోలతోనే సినిమాలను తెరకెక్కించాడు. ముఖ్యంగా బాలయ్యను అభిమానులు ఎలా చూపు దాలి అనుకుంటున్నారో అలా చూపించి సూపర్ హిట్లు అందుకున్నాడు.


 బోయపాటి శ్రీను దర్శకుడిగా పరిచయమైన మొదటి సినిమా భద్ర. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో వెనక్కి తిరిగి చూసుకోలేదు. అయితే బాలకృష్ణతో సింహ, లెజెండ్, అఖండ లాంటి బ్లాక్ బాస్టర్ హిట్లు సాధించి హ్యాట్రిక్ కొట్టాడు. అయితే బోయపాటి దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా సరైనోడు సినిమా వచ్చింది. ఈ సినిమా తెలుగులో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది.  అలాగే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో జయ జానకి నాయక తీయగా ఇది కూడా విజయం సాధించింది. అయితే ఈ రెండు సినిమాలు హిందీ డబ్బింగ్ వర్షన్ లో కూడా సూపర్ హిట్ అయ్యాయి. సరైనోడు హిందీ డబ్ యూట్యూబ్లో 1000 మిలియన్ వ్యూస్ సాధించగా బెల్లంకొండ జయ జానకి నాయక హిందీ డబ్ మూవీ 300 మిలియన్ న్యూస్ సొంతం చేసుకుంది. అయితే ఇప్పుడు వరకు భారతీయ దర్శకులు ఎవరికీ కూడా ఈ రికార్డు సాధ్యం కాలేదు. మరి భవిష్యత్తులో యూట్యూబ్ వేదికగా రాజమౌళి రికార్డు బ్రేక్ చేస్తాడో లేదో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: