నందమూరి హీరో, టిడిపి నేత నందమూరి తారకరత్న అకాల మరణంతో ప్రస్తుతం అభిమానులు అందరూ కూడా దిగ్భ్రాంతిలో మునిగిపోయారు అన్న విషయం తెలిసిందే. గుండెపోటుకు గురైన ఆయన గత కొంతకాలం నుంచి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఆయన కోలుకొని మళ్లీ సాధారణ మనిషిలా అందరి ముందుకు వస్తాడని అభిమానులందరూ కూడా ఎన్నో పూజలు చేశారు. కానీ పూజలు ఫలించలేదు. చివరికి ఆయన తుది శ్వాస విడిచారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే నందమూరి తారకరత్న మరణానికి గల కారణాలు ఏంటి అనే విషయంపై ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు తెరమిదికి వస్తూ ఉన్నాయి.



 నందమూరి తారక రత్న యొక్క చిన్నపాటి అజాగ్రత్త కారణంగానే చివరికి ఆయన ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చింది అన్నది తెలుస్తుంది. లోకేష్ పాదయాత్ర మొదలైన రోజు ఆయనకు గుండెపోటు వచ్చింది. అయితే పాదయాత్ర మొదలైన రోజు ఉదయం నుంచి ఆయన అస్వస్థతకు గురయ్యారట. అయినప్పటికీ ఇక మొండి పట్టుతో పాదయాత్రలో పాల్గొన్నారట. అదే సమయంలో ఎండలో తిరగడం ఇక చుట్టూ ఎక్కువ మొత్తంలో జనం గుమి గూడటం కారణంగా ఒక్కసారిగా సొమ్మసిల్లి  పడిపోయారట. అలాంటి సమయంలోనే గుండెపోటు రావడంతో పాటు కొంత సమయం రక్త ప్రసరణ కూడా ఆగిపోయి మెదడులో రక్తం గడ్డ కట్టిందట. పాత ఆరోగ్య సమస్యలు కూడా ప్రభావం చూపాయట.



 అయితే ఇలా అస్వస్థత విషయంలో ముందుగానే జాగ్రత్త వహించి తారకరత్న ఇక పాదయాత్రలో పాల్గొనకుండా ఉండి కాస్త రెస్ట్ తీసుకొని ఉంటే ఆయన మామూలు మనిషి లాగానే ఉండేవారు అని తెలుస్తుంది. కానీ ఆయన మొండి పట్టుతో అస్వస్థతకు గురైనప్పటికీ పాదయాత్రలో పాల్గొనడం వల్లే ఇక ఆయన ఆరోగ్యం మరింత క్షీణించి చివరికి ప్రాణాపాయస్థితికి చేరుకున్నారట. అయితే మరో నాలుగు రోజుల్లో తారకరత్న పుట్టినరోజు కాగా ఇప్పుడు ఇలాంటి విషాదకర ఘటన జరగడంతో అభిమానులు మరింత దిగ్భ్రాంతిలో మునిగిపోయారు. ఇక తారకరత్న మృతి పై ఎంతో మంది సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: