టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గ్లోబల్ లెవెల్ లో గుర్తింపు పొందిన ఇండియన్ డైరెక్టర్ దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా మరో ప్రముఖ అవార్డు దక్కించుకొని వార్తల్లో నిలిచింది. ఎన్టీఆర్ - రామ్ చరణ్ హీరోలుగా అజయ్ దేవగన్ , అలియాభట్ ఇంకా శ్రీయ లతో పాటు హాలీవుడ్ నటి నటులు నటించిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా చాలా పెద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకోవడమే కాదు ఈ చిత్రంలోని నాటు నాటు సాంగ్ అయితే ఏకంగా ఆస్కార్ అవార్డ్స్ బరిలో కూడా నిలిచింది.ఇక ఇప్పటికే ఈ ఎన్నో అవార్డ్స్ , రివార్డ్స్ దక్కించుకున్న ఈ సినిమా తాజాగా ఇండియన్‌ ఫిలిం ఇండస్ట్రీలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డుని కూడా సొంతం చేసుకుంది.సోమవారం నాడు రాత్రి ముంబైలో జరిగిన ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌ 2023 అవార్డుల ప్రదానోత్సవం చాలా అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ఫిలిం ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డుని దక్కించుకుంది. 


ఇంకా అలాగే కన్నడ చిత్రసీమ నుంచి చిన్న సినిమాగా విడుదలై దేశవ్యాప్తంగా కూడా సంచలన విజయం అందుకున్న కాంతార సినిమాకు కూడా అవార్డు వచ్చింది. ఈ సినిమాలో నటనకు గానూ మోస్ట్‌ ప్రామిసింగ్‌ యాక్టర్‌ అవార్డును హీరో రిషబ్‌ శెట్టి దక్కించుకున్నాడు. ఇక ఉత్తమ చిత్రంగా ది కశ్మీర్‌ ఫైల్స్‌  ఇంకా అలాగే ఉత్తమ నటుడిగా రణ్‌బీర్‌ కపూర్‌ ( బ్రహ్మస్త్ర 1) అలాగే ఉత్తమ నటిగా ఆలియాభట్‌ (గంగూబాయి కథియావాడీ) అవార్డు సొంతం చేసుకున్నారు.అయితే ఈ అవార్డుల పై ఇప్పుడు వివాదం చెలరేగుతుంది.ఎందుకంటే చాలా అవార్డులు కూడా బాలీవుడ్ కే దక్కాయి. మరీ దారుణమైన విషయం ఏమిటంటే అలియా భట్, రణబీర్ కపూర్, వరుణ్ ధావన్ లాంటి యాక్టర్లకి అవార్డు రావడం.రామ్ చరణ్, ఎన్టీఆర్ ల నటన కంటే వీళ్ళ నటన అంత బాగుందా? అనే విమర్శలు బాగా ఎక్కువవుతున్నాయి. వాళ్లకి రాని అవార్డులు వీళ్ళకి ఎలా వస్తాయి అని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: