బాలయ్య పెళ్ళికొస్తేనే తాళి కడతా అంటున్న వరుడు?

టాలీవుడ్ సీనియర్ హీరో బాల కృష్ణకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయన కోసం పడి చచ్చిపోయే అభిమానులు కూడా ఉన్నారు. ఇక తాజాగా ఆయన వస్తేనే తాళి కడాతానంటున్నాడు ఓ పెళ్లి కుమారుడు. ఆయనకే కాదు వాళ్ళకుటుంబం మొత్తానికి కూడా దేవుడు అంటే సీనియర్ ఎన్ టి ఆర్ నే.వారి పూజా గదిలో ఆయన ఫోటోలే ఉంటాయట.ఇక ఎన్ టి ఆర్ నే కాకుండా బాలయ్యని కూడా కుటుంబ సభ్యులు గుండెల్లో పెట్టుకుని ఆరాధిస్తారట. ఇక ఆ అభిమానాన్ని అంతటితో వదిలేయకుండా జీవితంలో ఎంతో కీలకమైన పెళ్లి ఘట్టంలో కూడా ఆయనకి స్థానం కల్పించడం విశేషం. విశాఖ జిల్లా పెందుర్తి మండలం చింతలగ్రహారం గ్రామానికి చెందిన పులమరశెట్టి వెంకటరమణ ఎన్టీఆర్ కు చాలా పెద్ద వీరాభిమాని.


ఆయన కుమారుడు పులమరశెట్టి కోమలీ పెద్దినాయుడుకి కూడా బాలయ్య బాబు అంటే ఎంతో పిచ్చి అభిమానం. అయితే ఇటీవల అతడికి పెళ్లి కుదిరింది. మార్చి 11 వ తేదీన వివాహం చేసేందుకు నిశ్చయించారు. పెళ్లి పిలుపు కోసం ముద్రించిన ఆరు పేజీల ఆహ్వాన పత్రికపై బాలకృష్ణ ఇంకా అలాగే , ఎన్టీఆర్ చిత్రాలను కూడా ముద్రించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. నందమూరి తారక రామారావు గారి దివ్య ఆశీస్సులతో.. అంటూ కూడా ఆ పత్రికలో రాసుకొచ్చారు.బాలయ్య కు తెలిసిన పలువురును కలిసి ఆయనకు సమాచారం ఇవ్వమని కూడా ఎంతగానో వేడుకున్నారు. కొంతమంది ఇచ్చాం అని చెప్పారని, అయితే కచ్చితంగా వస్తారని ఆశిస్తున్నట్టు తెలిపారు ఆ కుటుంబ సభ్యులు. ఆహ్వానం అందుకుంటున్న అతిథులు దాన్ని చాలా ఆసక్తిగా తిలకిస్తున్నారు.రీసెంట్ గా వీర సింహా రెడ్డి సినిమాతో హిట్ కొట్టిన బాలయ్య తన అన్న కొడుకు ప్రముఖ హీరో తారకరత్న చనిపోయిన బాధలో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: