బిగ్ బాస్ సీజన్ 4 లో టైటిల్ గెలవకపోయినా సరే పాతిక లక్షల క్యాష్ ప్రైజ్ తో బయటకు వచ్చాడు సోహైల్. అంతేకాదు ఆడియన్స్ లో అతను విన్నర్ అయ్యే క్యాండిడేట్ అనిపించుకునేలా చేశాడు. హౌజ్ లో అతను చేసిన హంగామా అంతా ఇంతా కాదు చికెన్ చికెన్ మటన్ మటన్ అంటూ నాన్ వెజ్ కోసం అంతను చేసిన హడావిడి ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యింది. ఈ క్రమంలో సోహైల్ కి సినిమా ఛాన్స్ లు వచ్చాయి. లక్కీ లక్ష్మణ్ అనే సినిమా ఒకటి రిలీజ్ కాగా అది నిరాశపరచింది.

ఇక లేటెస్ట్ గా సీనియర్ డైరెక్టర్ ఎస్వీ కృష్ణా రెడ్డి డైరెక్షన్ లో ఆర్గానిక్ మామా హైబ్రిడ్ అల్లుడు సినిమా చేశాడు. శుక్రవారం రిలీజైన ఈ సినిమా ఎందుకు తీశాడో కూడా అర్ధం కాలేదు. ఒకప్పుడు ఫ్యామిలీ సినిమాల్లో తనని మించిన వారు లేరనేలా చేసుకున్న కృష్ణా రెడ్డి చాలా రోజుల తర్వాత చేసిన ఈ సినిమా ప్రేక్షకుల్లో ఏమాత్రం బజ్ క్రియేట్ చేయలేకపోయింది. ఇక నిన్న రిలీజైన బలగం రేసులో విన్నర్ కాగా సోహైల్ సినిమా మాత్రం చేతులెత్తేసింది.

చాలా చోట్ల ఆ సినిమా రిలీజైన విషయం కూడా ఎవరికీ తెలియదని అంటే సినిమాపై ఆడియన్స్ ప్రభావం ఎలా ఉందో తెలుస్తుంది. ట్రైలర్ కూడా అంత ఆసక్తికరంగా ఏమి అనిపించలేదు. కృష్ణా రెడ్డి గారు ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ చేసిన ఈ సినిమాకు ఇలాంటి డిజాస్టర్ టాక్ రావడం షాక్ ఇస్తుంది. ఇక సోహైల్ కి అయితే ఈ సినిమా రిజల్ట్ మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది. ఇక తన నెక్స్ట్ సినిమా మిస్టర్ ప్రెగ్నంట్ మీద అన్ని హోప్స్ పెట్టుకున్నాడు సోహైల్. మరి ఆ సినిమా అయినా అతని అంచనాలను అందుకుంటుందా లేదా అన్నది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: