టాలీవుడ్ యంగ్ హీరో నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా దసరా. తెలుగు తమిళం కన్నడ మలయాళ హిందీ భాషల్లో ఏకకాలంలో దసరా సినిమా విడుదల కానుంది.ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి భారీ బడ్జెట్తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ మాస్ మసాలా ఎంటర్టైనర్ కి సుకుమార్ శిష్యుడు అయిన కొత్త డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తుండగా... చాలా కాలం తర్వాత తమిళ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణ్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే దసరా సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు సాంగ్స్ ఇంకా అలాగే టీజర్ నాని అభిమానుల్ని కాదు... సాధారణ ఆడియన్స్ ని కూడా చాలా విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా మరికొద్ది రోజుల్లోనే విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ లని వేగవంతం చేసింది చిత్ర యూనిట్.


తాజాగా ఈ సినిమా నుంచి మరో సాంగ్ కి సంబంధించిన ప్రోమో  రిలీజ్ చేయడం జరిగింది.3వ పాటని మార్చి 8వ తేదీన విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే సినిమా నుంచి చమ్మీల అంగీలు వేసి అనే పల్లవితో సాగిపోతున్న ఒక మెలోడియస్ సాంగ్కు సంబంధించిన ప్రోమోని  సినిమా యూనిట్ అధికారికంగా యూట్యూబ్లో రిలీజ్ చేసింది. రామ్ మిరియాల పాడిన ఈ సాంగ్కు కాసర్ల శ్యాం సాహిత్యంని అందించారు. ఇక మొత్తానికి ఈ పాట వినసొంపుగానే ఉంది.ఇక విడుదలైనప్పటి నుంచి ఈ సాంగ్ ప్రోమో యూట్యూబ్లో ఆకట్టుకుంటూ ఎంతగానో వైరల్ అవుతుంది. ఇంకా బాగా ఈ పాట ట్రెండ్ అవుతుంది కూడా.ఈ సాంగ్ ప్రోమోకి చాలా మంచి వ్యూస్ అయితే లభిస్తున్నాయి. ఇంకా రిలీజ్ కి దాదాపు నెలరోజులు కూడా లేని నేపథ్యంలో ఇక మీదట వరుసగా ఈ సినిమా ప్రమోషన్స్ ఫాస్ట్ గా చేయాలని సినిమా యూనిట్ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం తెలుస్తోంది. సింగరేణి గనుల నేపథ్యంలో సాగుతున్న ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని మూవీ నమ్ముతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: