ఈ మధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీలో నటి నటుల వాళ్ల ప్రేమ వ్యవహారాలు పెళ్లి వరకు వెళ్లడం, కొన్నాళ్లకు విడిపోవడం అనేది కొంతగాలంగా ట్రెండ్ అయిపోతుంది.ఇష్టపడి వివాహం చేసుకుని దశాబ్దాల తరబడి కాపురం చేసి పిల్లలు పెళ్లీడుకొస్తున్న సమయంలో విడిపోతున్నారు.. ఆఫ్టర్ మ్యారేజ్ బ్రేకప్ అనేది ఆమిర్ ఖాన్, సంజయ్ దత్, సైఫ్ అలీ ఖాన్ వంటి వారి కంటే ముందు నుండే కొనసాగుతోంది.. ఇక మలైకా అరోరా సంగతి తెలిసిందే.బాలీవుడ్ వాళ్లు ఇలాంటి విషయాల్లో హాలీవుడ్ వాళ్లని ఫాలో అవుతుంటారేమో కానీ చాలా చిన్న విషయాలకే విడిపోతుంటారు.

ఈమధ్య యంగ్ కపుల్స్ ఎంచక్కా వెడ్డింగ్స్ చేసుకుని కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తున్నారు. ఈ సమయంలో 19 ఏళ్ల వివాహ బంధానికి గుడ్‌బై చెప్తున్నట్టు ప్రకటించింది నటి శుభంగి ఆత్రే.వివరాల్లోకి వెళ్తే. సీరియల్ నటి శుభంగి ఆత్రే తన 19వ ఏట 2003లో డిజిటల్ మార్కెటింగ్‌లో పని చేస్తున్న పీయూష్ పూరేను పెళ్లి చేసుకుంది.. 2005లో వీరికి అశి అనే పాప పుట్టింది.19 సంవత్సరాల పాటు కాపురం చేశాక ఏడాది క్రితం విడిపోయిన వీరిద్దరూ అప్పటినుండి విడివిడిగా ఉంటున్నారు.

 

ఇప్పటి వరకు సీక్రెట్‌గా ఉన్న ఈ విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వూలో రివీల్ చేసింది శుభంగి ఆత్రే.''మేం కలిసి ఉండడం లేదు.. పరస్పర గౌరవం, నమ్మకం, స్నేహం అనేవి బలమైన పెళ్లికి పునాదులు.. మా వివాహ బంధాన్ని కాపాడుకోవడానికి మేం చాలా వరకు ప్రయత్నించాం కానీ కుదరలేదు.. గతేడాది కాలం నుంచి మేం సెపరేట్‌గా ఉంటున్నాం.. ఎందుకంటే మా మధ్య మనస్ఫర్థలు పరిష్కారమయ్యేలా కనిపించట్లేదు. అందుకే ఎవరి బతుకు వాళ్లు బతకాలనుకున్నాం.

ఈ విషయం నాకిప్పటికీ బాధగానే ఉంది.నేను ఫ్యామిలీ ఇంపార్టెంట్, ఎప్పుడూ కుటుంబ చూట్టూ ఉండాలనుకునేదాన్ని కానీ కొన్ని సమస్యలు చెయ్యాల్సిన నష్టాన్ని చేసేశాయి.ఎన్నో ఏళ్లు కలిసి ఉన్న బంధాన్ని తెంచుకోవడమంటే ఎంత మానసిక క్షోభ ఉంటుందో చెప్పలేను. నేను తనకు దూరమైనంత మాత్రాన నా కూతురికి తండ్రి ప్రేమ దక్కకుండా చెయ్యను.తనకు తల్లిదండ్రుల ప్రేమ అనేది కచ్చితంగా అవసరం.అందుకే పియూష్ ఆదివారాలు వచ్చి తనను కలుస్తుంటాడు'' అని అన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: