నాచురల్ స్టార్ నాని ఎప్పటికప్పుడు వైవిధ్యమైన మూవీ లను ఎంచుకుంటూ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరిస్తూ ముందుకు వెళుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. అలా ఇప్పటికే ఎన్నో అద్భుతమైన పాత్రలలో నటించి ఎంతో మంది ప్రేక్షకులను విమర్శకులను మెప్పించి ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని సంపాదించుకున్న నాని తాజాగా దసరా అనే మూవీ లో హీరో గా నటించాడు. కీర్తి సురేష్ ఈ సినిమాలో నాని సరసన హీరోయిన్ గా నటించగా ... శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాలకు దర్శకత్వం వహించాడు.

సంతోష్ నారాయణన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ ని మార్చి 30 వ తేదీన భారీ ఎత్తున తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ సినిమా బృందం ఈ మూవీ యొక్క ప్రమోషన్ లను మొదలు పెట్టింది. అందులో భాగంగా ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని పాటలను మరియు ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. అలాగే ప్రస్తుతం నానిమూవీ కి సంబంధించిన ప్రచారాలను దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్నాడు. 

ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఒక అద్భుతమైన అప్డేట్ ను ప్రకటించింది. తాజాగా ఈ సినిమా బృందం ఈ మూవీ యొక్క ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించింది. ఈ మూవీ యొక్క ట్రైలర్ ను 14 మార్చి 2023 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ యూనిట్ తాజాగా ప్రకటించిన ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: