తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటు వంటి హను రాఘవపూడి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ దర్శకుడు అందాల రాక్షసి మూవీ తో దర్శకుడి గా తన కెరీర్ ను మొదలు పెట్టి ఆ తర్వాత కృష్ణగాడి వీర ప్రేమ గాధ ... లై ... పడి పడి లేచే మనసు ... సీత రామం మూవీ లకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లతో ఈ దర్శకుడు ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ దర్శకుడు గా కెరీర్ ను కొనసాగిస్తున్నాడు.

ఇది ఇలా ఉంటే ఆఖరుగా ఈ క్రేజీ దర్శకుడు సీత రామం అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో దుల్కర్ సల్మాన్ హీరో గా నటించిన మృనాల్ ఠాకూర్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. రష్మిక మందన కీలక పాత్రలో నటించిన ఈ మూవీ లో సుమంత్ ... భూమిక చావ్లా ... గౌతమ్ వాసుదేవ్ మీనన్ ముఖ్య పాత్రలలో నటించారు. ఇది ఇలా ఉంటే పోయిన సంవత్సరం విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని ... భారీ కలెక్షన్ లను కూడా రాబట్టింది.

ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకున్న ఈ సినిమాకు బుల్లి తెరపై కూడా ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ యొక్క సాటిలైట్ హక్కులను స్టార్ మా సంస్థ వారు దక్కించుకున్నారు. అందులో భాగంగా ఈ మూవీ ని రెండవ సారి స్టార్ మా చానల్లో ప్రసారం చేయగా ఈ మూవీ కి 5.41 "టి ఆర్ పి" రేటింగ్ దక్కింది. రెండవ సారి కూడా ఈ రేంజ్ లో  "టి ఆర్ పి" రేటింగ్ తగ్గడం అనేది సూపర్ విషయం అని చెప్పవచ్చు. ఇలా సీత రామం మూవీ బుల్లి తెర ప్రేక్షకులను కూడా అదిరిపోయే రేంజ్ లో అలరిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: