సౌత్ సినిమా ఇండస్ట్రీ నుండి గత కొన్ని సంవత్సరాలుగా అదిరిపోయే రేంజ్ ఉన్న సినిమాలు వస్తున్న విషయం మన అందరికీ తెలిసింది. సౌత్ సినిమా ఇండస్ట్రీ నుండి రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి సినిమా ఎన్నో రికార్డులను సృష్టించింది. ఈ మూవీ తర్వాత సౌత్ ఇండస్ట్రీ నుండి "కే జి ఎఫ్" మూవీ అనేక కొత్త రికార్డులను సృష్టించింది. ఈ మూవీ కు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించాడు.

 ఈ మూవీ కూడా దేశ వ్యాప్తంగా ప్రేక్షకుల మరియు విమర్శకుల ప్రశంసలను అందుకుంది. ఈ రెండు మూవీ ల ద్వారా సౌత్ సినిమా ఇండస్ట్రీ క్రేజ్ అమాంతం పెరిగి పోయింది. అలాగే ఈ రెండు మూవీ లు కూడా కలెక్షన్ ల విషయంలో ప్రపంచ వ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎన్నో కొత్త కొత్త రికార్డు లను కూడా సృష్టించాయి. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ విజయాలను అందుకొని సౌత్ సినిమా ఇండస్ట్రీ సత్తాను చాటిన ఈ రెండు సినిమాలపై తాజాగా తమిళ ప్రొడ్యూసర్ కొన్ని వ్యాఖ్యలు చేశాడు.

అసలు విషయం లోకి వెళితే... ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీ.లో మంచి క్రేజ్ ఉన్న హీరో లలో ఒకరు అయినటు వంటి సూర్య తన కెరీర్ లో 42 వ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి తమిళ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన శివ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... ఈ మూవీ ని జ్ఞానవేల్ రాజా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఈ మూవీ పై తమిళ సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ ప్రొడ్యూసర్ అయినటు వంటి జ్ఞానవేల్ రాజా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ... సూర్య 42.వ మూవీ బాహుబలి మరియు కే జి ఎఫ్ మూవీ లకు సమాధానాన్ని ఇస్తుంది అని తెలిపాడు. ప్రస్తుతం జ్ఞానవేల్ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: