శ్రీదేవి వారసులుగా జాన్వీ కపూర్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చినప్పుడు ఆమె టాప్ హీరోయిన్ గా మారుతుందని చాల అంచనాలు వచ్చాయి. అయితే ఆమె మొదదటి సినిమా ‘ధడక్’ తప్ప మరే సినిమా కనీస విజయానికి కూడ నోచుకోలేదు. ఈమె ఎంచుకునే కథల విషయంలో పొరపాట్లు చేయడం వల్ల ఆమెకు సూపర్ హిట్స్ రాలేదు అన్నకామెంట్స్ కూడ ఉన్నాయి.


బాలీవుడ్ లో యంగ్ హీరోయిన్స్ మధ్య విపరీతమైన పోటీ ఉండటంతో జాన్వీ ఇప్పటికి కూడ ఆమె పూర్తిగా టాప్ హీరోయిన్ స్థానాన్ని చేరుకోలేకపోయింది. దీనితో ఆమె దృష్టి దక్షిణాది సినిమా రంగం పై పడింది. ఇలాంటి పరిస్థితులలో ఆమెకు అనుకోకుండా వచ్చిన జూనియర్ కొరటాల మూవీ ప్రాజెక్ట్ కు మరొక ఆలోచన లేకుండా ఓకె చేయడమే కాకుండా తన పారితోషిక విషయంలో పెద్దగా పట్టుపట్టకుండా ఆమె ఓకె చేసింది అన్నవార్తలు వస్తున్నాయి.


వాస్తవానికి ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీలో జూనియర్ చరణ్ తో సమానంగా నటించినప్పటికీ బాలీవుడ్ మీడియా వర్గాలు ఎక్కువగా చరణ్ పై ప్రశంసలు కురిపించడంతో తారక్ ఆశించిన క్రేజ్ బాలీవుడ్ లో రాలేదు అన్న విశ్లేషణలు కూడ ఉన్నాయి. కొరటాల దర్శకత్వంలో జూనియర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ భారీ స్థాయిలో తీస్తున్నప్పటికీ ఆమూవీకి ఎంతవరకు బాలీవుడ్ లో క్రేజ్ ఏర్పడుతుంది అన్న విషయాలను బట్టి తారక్ కెరియర్ బాలీవుడ్ లో కొనసాగుతుంది అన్నకామెంట్స్ కూడ ఉన్నాయి.


దీనితో జూనియర్ పాన్ ఇండియా హీరో అనిపించుకోవాలి అంటే కొరటాల తో అతడు చేస్తున్న మూవీకి బాలీవుడ్ లో కూడ భారీ ఓపెనింగ్స్ రావాలి. బాలీవుడ్ లో ఇప్పటికీ జాన్వీ కపూర్ అంటే మంచి క్రేజ్ ఉంది. తారక్ తో చేస్తున్న మూవీతో తనకు టాప్ హీరోయిన్ స్థానం దక్షిణాదిలో ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులలో వచ్చి తీరుతుంది అన్న కలలు జాన్వీకి ఉన్నాయి అంటారు. ఇప్పుడు జూనియర్ కూడ బాలీవుడ్ ప్రేక్షకులకు మరింత దగ్గర అవ్వాలి అంటే బాలీవుడ్ యూత్ కు విపరీతమైన క్రేజ్ ఉన్న జాన్వీతో తను కోరుకున్న పాన్ ఇండియా ఇమేజ్ తనకు వచ్చి తీరుతుందని భావిస్తున్నాడు అనుకోవాలి..మరింత సమాచారం తెలుసుకోండి: