పాన్ ఇండియా స్టార్ హీరో యంగ్ రెబల్ స్టార్  ప్రభాస్ ప్రధాన పాత్రలో.. దర్శకధీరుడు టాలీవుడ్ టాప్ డైరెక్టర్ అయిన రాజమౌళి తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం చత్రపతి. 2005 సెప్టెంబర్ 30 వ తేదీన విడుదలైన ఈ సినిమా అప్పుడు ఎంత పెద్ద మాస్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒక్క షాట్ కూడా బోర్ కొట్టకుండా రాజమౌళి చాలా పర్ఫెక్ట్ గా ఈ సినిమాని షార్ప్ చేశాడు.ఇప్పటికీ ఈ మూవీకి బుల్లితెరపై జనాల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తుంటుంది.ఇంకా అంతేకాకుండా.. మాస్ హీరోగా ప్రభాస్ కు మంచి ఇమేజ్ తెచ్చిపెట్టింది కూడా ఈ మూవీనే. 18 సంవత్సరాల కిందట తెలుగు బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన ఈ సినిమా ఇక ఇప్పుడు బాలీవుడ్ లో రీమేక్ అవుతుంది. ఈ మూవీతో టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ హిందీలో తెరంగేట్రం చేస్తుండగా.. ఈ రీమేక్ కు టాలీవుడ్ సీనియర్ దర్శకుడు వి.వి. వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. కొద్ది రోజులుగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.


ఈ క్రమంలో తాజాగా సోమవారం నాడు ఈ సినిమా టైటిల్ పోస్టర్ రిలీజ్ చేస్తూ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్.హిందీలో కూడా ఒరిజినల్ టైటిల్ కొనసాగిస్తున్నారు మేకర్స్. వేసవి కానుకగా ఈ ను మే 12 వ తేదీన రిలీజ్ చేయబోతున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించింది. ఫస్ట్ లుక్ పోస్టర్ లో బెల్లంకొండ శ్రీనివాస్ కండలు తిరిగిన బాడీతో చేతిలో చెంబు పట్టుకుని సముద్రం వైపు తిరిగి కనిపిస్తున్నారు. అయితే అలా ఈ పోస్టర్ రిలీజ్ అయ్యిందో లేదో బాలీవుడ్ అభిమానుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమా రిలీజ్ అయ్యి అక్కడ పెద్ద హిట్ అయితే ఇక నో డౌట్ శ్రీనివాస్ కూడా పెద్ద స్టార్ హీరో అవ్వడం ఖాయం. ఇక ఈ సినిమాను పెన్ స్టూడియోస్ బ్యానర్ పై జయంతి లాల్ నిర్మిస్తున్నారు.మరీ ఈ సినిమాతో హిందీలో బెల్లంకొండ శ్రీనివాస్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటాడా లేదా అనేది చూడాలి. అయితే ఈ సినిమాలో నటించిన హీరోయిన్ ఎవరనేది ఇప్పటికీ క్లారిటీ రాలేదు. ఇంకా అలాగే ఇందులో నటించే నటీనటుల గురించి కూడా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: