తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ప్రస్తుతం అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న యువ హీరోలలో నాని ఒకరు. నాని ఇప్పటికే ఎన్నో అద్భుతమైన మూవీ లలో హీరో గా నటించి తన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను ... విమర్శకులను మెప్పించి ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని సంపాదించుకున్నాడు. ఇలా టాలీవుడ్ ఇంట్రెస్ట్ లో తనకంటూ ఒక సూపర్ క్రేజ్ ను ఏర్పరచుకున్న నాని తాజాగా దసరా అనే ఊర మాస్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు.

 కీర్తి సురేష్ ఈ సినిమాలో నాని కి జోడిగా నటించగా ... శ్రీకాంత్ ఓదెలా ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన ఈ మూవీ ని మార్చి 30 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాష లలో భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేశారు. ఇది ఇలా ఉంటే భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్ లు లభిస్తున్నాయి.

 అందులో భాగంగా దసరా మూవీ కి "యూ ఎస్ ఏ" బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా ప్రస్తుతం సూపర్ కలెక్షన్ లు లభిస్తున్నాయి. ఇప్పటికే "యూ ఎస్ ఏ" బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ మూవీ కి 850 ప్లస్ గ్రాస్ కలెక్షన్ లు దక్కినట్లు మరియు అదిరిపోయే రేంజ్ లో ఈ మూవీ కి కలెక్షన్ లు వస్తున్నట్లు ఈ మూవీ బృందం తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. ఇలా ఈ మూవీ ప్రస్తుతం "యు ఎస్ ఏ" బాక్స్ ఆఫీస్ దగ్గర ఊచ కోత కోస్తున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: